శ్రీశైలమే కాదు ఆలంపూర్, కొల్లాపూర్, గద్వాల కూడా సీమాంధ్రవే: టీజీ
శ్రీశైలం ప్రాజెక్టు మాత్రమే కాదు ఆలంపూర్, కొల్లాపూర్, గద్వాల నియోజకవర్గాలు కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందినవేనని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఓపక్క ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తుందంటూనే... మరోపక్క చర్చలు, కేబినెట్ సమావేశం అంటూ పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. పార్లమెంటుకు టీ బిల్లు తీసుకువస్తే పార్లమెంటును ముట్టడిస్తామని టీజీ స్పష్టం చేశారు. పార్లమెంటు ముట్టడికి తన వంతుగా జనాలను ఢిల్లీ పంపిస్తానని వెల్లడించారు. రికార్డులు పరిశీలిస్తే చాలా ప్రాంతాలు సీమాంధ్ర ప్రాంతానికి చెందినవే ఉంటాయని మంత్రి టీజీ అభిప్రాయపడ్డారు.