రోడ్లు పేదవారికి ఆహారాన్ని ఇవ్వలేవు : రాహుల్ గాంధీ
తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రోడ్లు అద్భుతంగా ఉన్నాయని చెబుతున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. రోడ్లవల్ల పేదలకు ఒరిగేదేమీ లేదని... అవి పేదలకు ఆహారాన్ని కూడా ఇవ్వలేవని అన్నారు. రైతు పొలంలో స్వేదం చిందిస్తాడని, కేవలం డబ్బున్న వారే రోడ్డుపై కారులో వెళతారని వ్యాఖ్యానించారు. తన దృష్టిలో అభివృద్ధి అంటే ఆరోగ్య, విద్యా రంగాలకు చెందినదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.