ఐటీ కంపెనీలకు నిరంతరాయ విద్యుత్తు
ఐటీ కంపెనీలకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ ఆధ్వర్యంలో సచివాలయంలో ఐటీ శాఖ సమీక్ష జరిగింది. ఐటీ కంపెనీలకు అన్ని వేళలా విద్యుత్తు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని అనంతరం పొన్నాల మీడియాకు తెలిపారు. చిన్న పట్టణాలలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే రాయితీలు ఇస్తామని ప్రకటించారు.