అక్బరుద్దీన్ పై మరో కేసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్బరుద్దీన్ పై మరో కేసు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండు ఖైదీగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై  హైదరాబాదులోని మంగళ్ హాట్ పోలీసుస్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 295(ఎ), 298 కింద ఈ కేసులు నమోదయ్యాయి. 16వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో టీడీపీ కార్పోరేటర్ రాజాసింగ్ లోథ్  ప్రైవేటు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

More Telugu News