ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మొదటి మ్యాచ్ ను డ్రా చేసుకున్న ఆనంద్
చెన్నైలో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ ఛాంపియన్, భారత ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ తన తొలి మ్యాచ్ ను డ్రాగా ముగించాడు. ఈ గేమ్ లో ఆనంద్ నల్ల పావులతో ఆడాడు. నార్వే కు చెందిన మాగ్నస్ కార్ల్ సన్ తో దాదాపు గంటన్నర పాటు జరిగిన మ్యాచ్ లో... 16 ఎత్తులు వేసిన ఆనంద్ డ్రాకు అంగీకరించాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్లకు చెరొక సగం (0.50) పాయింట్ లభించింది. వీరిద్దరూ మొత్తం 12 మ్యాచ్ లు ఆడతారు. ఎవరు ముందుగా 6.5 పాయింట్లు సాధిస్తారో వారే ప్రపంచ ఛాంపియన్ షిప్ విజేతలుగా అవతరిస్తారు.