షిండేపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేశవరావు
కేంద్ర హోం మంత్రి సుశీల్
కుమార్ షిండేపై కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు మండిపడ్డారు. నెలరోజుల్లో
తెలంగాణపై తేలుస్తామని మాట ఇచ్చి, ఇప్పుడు తెలంగాణ ప్రజలను షిండే అవమానపరిచారని
ధ్వజమెత్తారు. రాష్ట్రంపై నిర్ణయం తీసుకోవడానికి ఏళ్లు గడుస్తున్నాయనీ, అయినా ఇంతవరకు ఎలాంటి
నిర్ణయం వెలువడలేదని కేశవరావు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ కోసం
ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్న కేకే, తాను కాంగ్రెస్ వైపు లేననీ,
తెలంగాణకోసం పని చేస్తున్నానని చెప్పారు.