'తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్'కు తాత్కాలిక అధ్యక్షుడు
తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) కు తాత్కాలిక అధ్యక్షుడిగా అస్మతుల్లా షహీన్ నియమితుడయ్యాడు. రెండు రోజుల క్రితం ఉత్తర వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంపై అమెరికా జరిపిన డ్రోన్ విమాన దాడుల్లో హకీముల్లా మసూద్ మరణించాడు. దాంతో, తమ తాత్కాలిక నేతగా అస్మతుల్లాను పాక్ తాలిబన్ నియమించుకుందని... పాక్ స్థానిక మీడియా తెలిపింది.