మొన్నటి వర్షాలను జాతీయ విపత్తుగా పరిగణించాలి : చంద్రబాబు
వర్షాల వల్ల రైతులు పూర్తిగా నష్టపోయినా... సీఎం ఒక్క రైతును కూడా కలవలేదని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. నష్టపోయిన రైతులు పండుగ గురించే మర్చిపోతే... సీఎం మాత్రం పండుగ సంబరాల్లో మునిగిపోయారని అన్నారు. గవర్నర్ తో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. మొన్నటి వర్షాలను జాతీయ విపత్తుగా పరిగణించాలని తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గవర్నర్ ను కోరినట్టు తెలిపారు.
రైతులకు జరిగిన నష్టం గురించి మంత్రులెవరూ పట్టించుకోలేదని విమర్శించారు. వరద బాధితులకు నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత రైతులను పరామర్శించడానికి తాను వెళ్లిన ప్రతి చోటా కుళ్లిపోయిన పంటలే కనిపించాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇవ్వాలనుకుంటున్న పరిహారాన్ని కూడా పెంచాలని అన్నారు. వాణిజ్య పంటలకు ఎకరాకు రూ. 20 వేలు, ఆహార పంటలకు ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.