సీబీఐ కోర్టుకు హాజరైన జగన్
అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ అధినేత జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఇండియా సిమెంట్స్ కంపెనీ కేసు విచారణ నేపథ్యంలో ఆయన కోర్టుకు వచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, ఆడిటర్ విజయసాయి రెడ్డి కూడా సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.