టాటా-సింగపూర్ ఎయిర్ లైన్స్ ఒప్పందానికి ఎఫ్ఐపీబీ అనుమతి
సింగపూర్ ఎయిర్ లైన్స్ భారత్ కి చెందిన టాటాసన్స్ తో సంయుక్తంగా నెలకొల్పదలచుకున్న కొత్త విమానయాన సంస్థకి ఎఫ్ఐపీబీ (ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్) అనుమతి లభించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద మయారామ్ ప్రకటించారు. టాటాసియా ఎయిర్ లైన్స్ లిమిటెడ్ అనే ఈ కొత్త విమానయాన సంస్థలో టాటా సన్స్ కు 51 శాతం వాటా, సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 49 శాతం వాటా ఉంటుంది.