విజ్డెన్ ఆల్ టైమ్ జట్టులో సచిన్ కు చోటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజ్డెన్ ఆల్ టైమ్ జట్టులో సచిన్ కు చోటు

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత క్రికెట్ మ్యాగజైన్ విజ్డెన్ ప్రకటించిన ఆల్ టైమ్ జట్టులో సచిన్ కూ చోటు దక్కింది. 150వ వార్షికోత్సవం సందర్బంగా విజ్డెన్ ఈ టీమ్ ను ప్రకటించింది. పదకొండుమందితో ప్రకటించిన ఈ ఆల్ టైమ్ జట్టుకు ఆసీస్ లెజెండ్ డాన్ బ్రాడ్ మన్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. జట్టు సభ్యుల వివరాలు.. డాన్ బ్రాడ్ మన్ (కెప్టెన్), సచిన్ టెండూల్కర్ (భారత్), డబ్ల్యూజీ గ్రేస్, జాక్ హాబ్స్, అలెన్ నాట్, సిడ్ బార్నెస్ (ఇంగ్లండ్), రిచర్డ్స్, సోబర్స్, మాల్కం మార్షల్ (వెస్టిండీస్), వసీం అక్రమ్ (పాకిస్థాన్), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా).

More Telugu News