క్రికెట్ మైదానానికి సచిన్ పేరు పెట్టడం చట్ట వ్యతిరేకం: శివసేన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్రికెట్ మైదానానికి సచిన్ పేరు పెట్టడం చట్ట వ్యతిరేకం: శివసేన

ముంబైలోని కాండివ్లి మైదానానికి సచిన్ టెండూల్కర్ పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చర్య చట్ట వ్యతిరేకమని శివసేన వ్యాఖ్యానించింది. మైదానానికి సచిన్ పేరు పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని... మైదానం పేరు మార్చేందుకు ఎంసీఏ అనుసరిస్తున్న విధానానికి మాత్రమే వ్యతిరేకమని శివసేన నేత యశోధర్ తెలిపారు. ఈ మైదానాన్ని ఎంసీఏకు ముంబై మునిసిపల్ కార్పొరేషన్ లీజు కింద ఇచ్చిందని అన్నారు. ముంబైలో ఏ రోడ్డుకైనా, ప్రాంతానికైనా, కట్టడానికైనా పేరుపెట్టాలనుకుంటే ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.

More Telugu News