అత్యాచారం కేసులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పై విచారణకు డిమాండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్యాచారం కేసులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పై విచారణకు డిమాండ్

కేరళలోని సూర్యనెళ్లికి చెందిన పదహారు సంవత్సరాల బాలిక అత్యాచారం కేసులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ పై విచారణ చేయాలంటూ పలువురి నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ దారుణ ఘటనలో కురియన్ కు సంబందం ఉందనీ, విచారణలో ఆయన పేరు చేర్చి నిర్ధారణ చేయాలని కేరళ అసెంబ్లీ సమావేశాల్లో ఎల్డీఎఫ్ కూటమికి చెందిన ప్రధాన ప్రతిపక్షం సీపీఐ (ఎమ్) డిమాండ్ చేస్తోంది.

అయితే, వీరి నోటీసుపై జీరో అవర్ లో చర్చించేందుకు సభ తిరస్కరించింది. దాంతో మహిళా ఎమ్మేల్యేలు ప్లకార్డులు పట్టుకొని సభ బయట నిరసన చేపట్టారు. వెంటనే సభాపతి జీ. కార్తికేయన్ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. 
దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర హోం మంత్రి టి.రాధాక్రిష్ణన్, కురియన్ పై పునర్విచారణ చేపట్టాలన్నడిమాండుకు అంగీకరించలేమన్నారు. 

ఇదిలావుంటే సాక్షాత్తూ బాధితురాలే అప్పటి హోం మంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత వీఎస్ అచ్యుతానందన్ కు లేఖ రాసింది. అయినా ఇప్పటివరకూ ఫలితంలేదు. అయితే అప్పట్లో కేరళ హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా కురియన్ కు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని తీర్పునిచ్చాయి. 1996లో జరిగిన ఈ ఘటనలో 42 మంది 40 రోజులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో కురియన్ కూడా ఓ వ్యక్తని, ఆయనను శిక్షించాలంటూ బాధితురాలు పేర్కొనడంపై దుమారం చెలరేగింది.

More Telugu News