ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ లో సీబీఐ విచారణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ లో సీబీఐ విచారణ

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. యూనివర్శిటీ పరిధిలో చదువుతున్న 30 మంది మెడిసిన్ విద్యార్ధులపై సీబీఐ ఈ విచారణ జరుపుతోంది. కర్నూలు శాంతారాం కాలేజీకి చెందిన విద్యార్ధులు ఛండీగడ్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ లో మాస్ కాపీయింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు రావటంతో సీబీఐ ఈ విచారణ చేస్తోంది. విద్యార్ధులు వైద్య,విద్య చదివారా? లేదా? అనే దానిపై నిర్దారించడం కోసం వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ యూనివర్శిటీ అధికారుల ఫిర్యాదు మేరకు సీబీఐ విచారణ జరుగుతోంది.

More Telugu News