తెలంగాణ శాసనసభ ఆవరణలో మొక్కలను నాటిన అసెంబ్లీ స్పీకర్ పోచారం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ శాసనసభ ఆవరణలో మొక్కలను నాటిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మండలి విప్ కుచికుళ్ళ దామోదర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహాచార్యులు.

ఈ సందర్భంగా సభాపతి కామెంట్స్:
  • ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రధాత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక 68వ జన్మధిన శుభాకాంక్షలు.
  • వారు నిండు నూరేళ్ళు ఆయుఃరారోగ్యాలతో జీవించి రాష్ట్రానికి, ప్రజలకు సేవలందించాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.
  • భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హరితహారం కార్యక్రమం చేపట్టారు.
  • తద్వారా రాష్ట్రంలో 22 శాతం ఉన్న అటవీ విస్తీర్ణం 33 శాతంకు పెరుగుతుంది.
  • సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ చాలెంజ్ ద్వారా రాష్ట్రంతో పాటుగా దేశ, విదేశాలలో ప్రజలు, నాయకులు, సెలబ్రేటీలు మొక్కలు నాటుతున్నారు.
  • ప్రకృతిని కాపాడాలి. లేకపోతే ఏవిధంగా విద్వంసం జరుగుతుందో ఈ మధ్య సంభవించిన ఉత్తరాఖండ్ వరదలు ఉదాహరణ.
  • కేవలం భూతాపం పెరిగి ఆకస్మీక వరదలతో విద్వంసంతో పాటుగా ప్రాణనష్టం జరిగింది.
  • ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా కోటి మొక్కలను నాటడం అభినందించదగిన కార్యక్రమం. 

More Press News