ఆధ్యాత్మిక అక్షర చైతన్యం: త్యాగరాయగానసభలో పురాణపండ 'విష్ణు సహస్రం' ఉచిత పంపిణీ

ఆధ్యాత్మిక అక్షర చైతన్యం: త్యాగరాయగానసభలో పురాణపండ 'విష్ణు సహస్రం' ఉచిత పంపిణీ
నేటి వ్యాపారమయ ప్రపంచంలో ఆధ్యాత్మిక గ్రంథాలను సైతం విక్రయిస్తున్న ధోరణికి భిన్నంగా, 'పురాణపండ శ్రీనివాస్' అనే అక్షర యోధుడు తన రచనల ద్వారా నిస్వార్థ సేవను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని చారిత్రాత్మక 'త్యాగరాయగానసభ' ఆధ్వర్యంలో పురాణపండ శ్రీనివాస్ రచించిన 'శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం' దివ్య గ్రంథాన్ని భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

సామాన్యులకు అక్షర ప్రసాదం
పెద్ద పెద్ద పీఠాలు, మఠాలు సైతం గ్రంథ ప్రచురణలను వ్యాపారాత్మకంగా చేస్తున్న తరుణంలో, పురాణపండ శ్రీనివాస్ గత రెండు దశాబ్దాలుగా వేల కొలది గ్రంథాలను భక్తులకు ఉచితంగా అందజేస్తున్నారు. పచ్చ కర్పూరపు పలుకుల్లాంటి శైలితో, మల్టీ కలర్ ముద్రణలో రూపొందించిన ఈ 128 పేజీల విష్ణు సహస్రనామ గ్రంథం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పుస్తకాన్ని వైకుంఠ ఏకాదశి నుండి పంపిణీ చేస్తుండగా, భక్తుల కోరిక మేరకు ఈ ఏడాది ఉగాది పర్వదినం వరకు ఉచితంగా పొందవచ్చని గానసభ కార్యవర్గం ప్రకటించింది.

20260107fr695de5ad5fc08.jpg     
ప్రముఖుల ప్రశంసలు - అరుదైన రికార్డులు
పురాణపండ శ్రీనివాస్ లేఖిని నుండి జాలువారిన 'నేనున్నాను' గ్రంథాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించగా, 'మహామంత్రస్య' గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అలాగే 'శ్రీ పూర్ణిమ' గ్రంథాన్ని విఖ్యాత ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించి శ్రీనివాస్ కృషిని కొనియాడారు. కంచి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహాన్ని సైతం పొందిన శ్రీనివాస్ 'శ్రీమాలిక' వంటి వైదిక నిధులను 25 ఎడిషన్ల వరకు తీసుకెళ్లి యువతలోనూ ఆధ్యాత్మికతపై ఆసక్తిని పెంచారు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
"ఒక విజిటింగ్ కార్డు ఇవ్వడానికే ఆలోచించే రోజుల్లో, ఎంతో విలువైన గ్రంథాలను ఏ స్వార్థం లేకుండా ఉచితంగా ఇవ్వడం ఒక్క పురాణపండ శ్రీనివాస్‌కే చెల్లింది" అని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కొనియాడటం గమనార్హం. జంట నగరాల విష్ణు భక్తులు చిక్కడపల్లిలోని త్యాగరాయగానసభ కార్యాలయంలో ఈ దివ్య గ్రంథాన్ని ఉచితంగా పొందవచ్చని నిర్వాహకులు కోరారు.
Puranapanda Srinivas
Gnana Maha Yagna Kendram
Tyagaraya Ganasabha
Sri Vishnu Sahasranama Stotram
Bollineni Krishnaiah
Kala Janardhana Murthy

More Press News