జీ తెలుగు సండే మూవీ మహోత్సవం.. ఈ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
హైదరాబాద్, 20 డిసెంబర్ 2025: వారం వారం సరికొత్త సినిమాలతో అలరించే జీ తెలుగు ఈ ఆదివారం(డిసెంబర్ 21) ఐదు బ్లాక్బస్టర్ సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమైంది. జీ తెలుగు ‘సండే మూవీ మహోత్సవం’లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఐదు సూపర్హిట్ సినిమాలను ప్రసారం చేయనుంది. ఈ సినీ మారథాన్ను ఆస్వాదించేందుకు మీరూ సిద్ధంకండి!
ఈ సినీ మహోత్సవం ఉదయం 9 గంటలకు టాలీవుడ్ సెన్సేషనల్ హిట్, మెగా సూపర్ హీరో సినిమా ‘హనుమాన్’తో అట్టహాసంగా ప్రారంభం కానుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించే ఈ విజువల్ వండర్ తర్వాత, మధ్యాహ్నం 12 గంటలకు కల్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘర్షణ’ ప్రసారం కానుంది. ఉత్కంఠభరితమైన ఈ రెండు సినిమాలతో ఆదివారం మధ్యాహ్నం సరదాగా సాగిపోనుంది.
ఈ మెగా మూవీ మారాథాన్‌లో భాగంగా మరో సినిమా.. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ‘అయలాన్’ మొట్టమొదటి సారిగా తెలుగు బుల్లితెరపై గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వస్తున్న ఈ సినిమా ఏలియన్, మనుషుల మధ్య జరిగే ఆసక్తికరమైన పోరాటంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. గ్రాఫిక్స్, ఆకట్టుకునే కథాంశంతో అలరించే ఈ సినిమా సండే మూవీ మహోత్సవంలో స్పెషల్గా నిలువనుంది. అంతేకాదు, వినోదాల వెల్లువ సాయంత్రం కూడా కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఫెస్టివ్ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, రాత్రి 9 గంటలకు గ్రిప్పింగ్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. యాక్షన్, ఫాంటసీ, డ్రామా, సస్పెన్స్ వంటి అన్ని రకాల జోనర్లను మేళవించిన జీ తెలుగు ‘సండే మూవీ మహోత్సవం’ను మీరూ మిస్ కాకుండా ఎంజాయ్ చేయండి!
ఈ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నాన్-స్టాప్ బ్లాక్‌బస్టర్ మూవీ మారాథాన్ మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!