Meenakshi Chaudhary: ఇకపై అలాంటి కారెక్టర్‌లు చేయను: నటి మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary No More Wife or Mother Roles
  • ఇకపై భార్య, తల్లి వంటి పాత్రలు చేయనని చెప్పేస్తానన్న మీనాక్షి చౌదరి
  • ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌కు భార్యగా నటించినందుకు మంచి ప్రశంసలు వచ్చాయని వెల్లడి
  • లక్కీ భాస్కర్ మూవీ కథ నచ్చడంతో తల్లి పాత్రకు ఒప్పుకున్నానన్న మీనాక్షి
ఇకపై భార్య, తల్లి వంటి పాత్రలు చేయనని నటి మీనాక్షి చౌదరి స్పష్టం చేశారు. కెరీర్ ప్రారంభ దశలోనే ఇలాంటి పాత్రలు చేస్తే వాటికే పరిమితమయ్యే ప్రమాదం ఉందని స్నేహితులు హెచ్చరించారని ఆమె వెల్లడించారు. ఈ అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

"ఇచట వాహనములు నిలుపరాదు" మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన మీనాక్షి చౌదరి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ మూవీలో ఆమె కీలక పాత్రలో కనిపిస్తోంది. మారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.

ఈ సందర్భంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు భార్యగా నటించినందుకు మంచి ప్రశంసలు దక్కాయన్నారు. అయితే కెరీర్ ప్రారంభంలోనే భార్య, తల్లి పాత్రలు చేయడం భవిష్యత్తులో ఇమేజ్‌ను పరిమితం చేస్తుందని కొందరు స్నేహితులు హెచ్చరించారని, అలాంటి పాత్రలు చేస్తే అమ్మ, అక్క క్యారెక్టర్లకే అవకాశాలు వస్తాయని వారు చెప్పారని తెలిపింది.

అయితే, లక్కీ భాస్కర్ మూవీ కథ నచ్చడంతో తల్లి పాత్రకు ఒప్పుకున్నానని మీనాక్షి తెలిపారు. అయితే, ఇకపై అలాంటి పాత్రలు వస్తే చేయలేనని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు.  
Meenakshi Chaudhary
Meenakshi Chaudhary actress
Anaganaga Oka Raju movie
Lucky Bhaskar movie
Telugu cinema
Tollywood actress
Naveen Polishetty
Dulquer Salmaan
Sithara Entertainments
Telugu movies

More Telugu News