‘రాకాస’ ఏప్రిల్ 3న సినిమా విడుద‌ల‌

‘రాకాస’ ఏప్రిల్ 3న సినిమా విడుద‌ల‌
ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో.. నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిర్మిస్తోన్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్ ఖ‌రారు చేసి.. టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. సినిమాను ఏప్రిల్ 3న విడుద‌ల చేయటానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

https://www.instagram.com/p/DTP_aFBkWIl/ 

‘రాకాస‌’ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా మెప్పించ‌నున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇది వ‌ర‌కే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో సంగీత్ శోభ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తే.. మానస శర్మ రచయితగా వ‌ర్క్ చేశారు. త‌ర్వాత మాన‌స  సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ5 బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న రాకాస చిత్రంతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

https://www.instagram.com/p/DTQF4RWEWZJ/ 

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు నిహారిక కొణిదెల‌, ఉమేష్ కుమార్ బ‌న్సాల్ మాట్లాడుతూ ‘‘సంగీత్ శోభన్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ మేం స్టార్ట్ చేసిన సినిమాకు ‘రాకాస‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశాం. ఇదొక ఫాంట‌సీ కామెడీ మూవీ. న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఒక సాంగ్, నాలుగు రోజుల టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి ఉంది.త్వ‌ర‌లోనే దాన్ని కంప్లీట్ చేస్తాం. స‌మ్మ‌ర్ సంద‌ర్బంగా ఏప్రిల్ 3న మూవీని రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

అనుదీప్ దేవ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు: సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌, అమ‌న్‌, అనూప్ సింగ్ ఠాకూర్‌, ర‌మ‌ణ భార్గ‌వ్‌, వాసు ఇంటూరి, రోహిణి (బ‌జ‌ర్ద‌స్త్‌), రోహ‌న్ (నైంటీస్‌) త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్స్:  జీ స్టూడియోస్‌, పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌ l నిర్మాత‌లు:  నిహారిక కొణిదెల‌, ఉమేష్‌కుమార్ బన్సాల్‌ l క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ద‌ర్శ‌క‌త్వం:  మాన‌స శ‌ర్మ‌ l ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  మ‌న్యం ర‌మేష్‌ l ఆడిష‌న్ స్క్రీన్ ప్లే: మ‌హేష్ ఉప్పాల‌ l సంగీతం: అనుదీప్ దేవ్‌ l సినిమాటోగ్రాఫ‌ర్‌:  రాజు ఎదురోలు l యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌:  విజ‌య్‌ l ఎడిట‌ర్‌: అన్వ‌ర్ అలీ l ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  రామాంజ‌నేయులు l ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  పుల్ల విష్ణు వ‌ర్ధ‌న్‌ l కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: సంధ్య సబ్బ‌వ‌ర‌పు l పి.ఆర్.ఒ:  ఎస్‌.కె.నాయుడు-ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా) l ఈవెంట్ పార్ట్‌న‌ర్‌:  యు వుయ్ మీడియా l మార్కెటింగ్‌:  టికెట్ ఫ్యాక్ట‌రీ.
Tollywood
Cinema

More Press News