రేపు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

‘‘కరోనా నేపథ్యంలో గత యాసంగి పంటలను గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించడం జరిగింది. ఇంకా కరోనా ముప్పు తొలగలేనందున వర్షా కాలం పంటలను కూడా గ్రామాల్లోనే కొనుగోలు చేయాలి. 6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. పంటలు కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించాలి. దీని కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముందుగానే చేయాలి’’ అని సీఎం అధికారులను ఆదేశించారు.

More Press News