ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్‌లో సముద్రఖని

ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్‌లో సముద్రఖని
సముద్రఖని  సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా దర్శకుడిగా ఏది చేసిన తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఫుల్ బిజీగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. దర్శకుడిగా చేసినా, నటుడిగా చేసినా సముద్రఖని చేశాడు అంటే అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుంది.

తన మనసుకి నచ్చితేనే పాత్ర చేస్తాననే సముద్రఖని గురించి సోషల్ మీడియాలో ఓ వార్తా హల్చల్ చేస్తుంది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుని బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు ఇప్పటికే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలైనట్టు తెలుస్తుంది. 

ఆ రాజకీయనాయకుడు అవినీతి మచ్చలేని వ్యక్తిగా, పేద ప్రజల ఆశ జ్యోతిగా, ఉండడానికి స్వంత ఇళ్ళు కూడా సరిగ్గా నిర్మించుకోలేని ఓ గొప్ప మానవాతివాది కావడంతో అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ జనరేషన్ కి తెలియాలనే ఉద్దేశంతో ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్నట్టు సినీ సన్నిహితుల నుంచి సమాచారం. ఇదే కనుక నిజమైతే సముద్రఖని మరో నట విశ్వరూపం మనం చూడబోతున్నాం. ఏం జరుగుతుందో మున్ముందు చూడాలి.
Biopic
Samudrakhani

Watch Today's Deals on Amazon

More Press News