Krishna Gadu Ante Oka Range: ఆహాలో ఆకట్టుకుంటోన్న ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’

ఆహాలో ఆకట్టుకుంటోన్న ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’

ఆహాలో ఆకట్టుకుంటోన్న ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా ర‌ఘురామ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 4న రిలీజ్ అయింది. థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటోంది.

మంచి లవ్ స్టోరీ, స్వచ్చమైన ఎమోషన్స్‌తో తీసిన ఈ విలేజ్ డ్రామా థియేటర్లో ఆడియెన్స్ నుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు ఆహాలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం ఈ మూవీ ఆకట్టుకుంటోంది. స్వచ్చమైన ప్రేమ కథకు ట్విస్టులు, ఎమోషన్‌ను జోడించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక హీరో హీరోయిన్ల నటన, వారిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలం.

ఈ సినిమాకు సాబు వర్గీస్ సంగీతం, ఎస్‌కే రఫీ అందించిన కెమెరా వర్క్ అదనపు ఆకర్షణ. గ్రామీణ ప్రాంతంలోకి తీసుకెళ్లేలా కెమెరామెన్ అద్భుతం చేశాడు. కొత్త టీం అంతా కలిసి చేసిన ఈ ప్రయత్నం థియేటర్లో అందరినీ మెప్పించగా.. ఇప్పుడు ఆహాలో అందరినీ మైమరిపిస్తోంది.

       
Krishna Gadu Ante Oka Range

Watch Today's Deals on Amazon

More Press News