ఆగస్టు 4న విడుదలకు సిద్దమైన ఫీల్ గుడ్ మూవీ 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'

Related image

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా ఓ డిఫరెంట్ యాంగిల్ లవ్ స్టోరీగా 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్' సినిమా రూపొందుతోంది. సరికొత్త కథ, కథనంతో నేటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు పొందుపరుస్తూ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 
  
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్' చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని లాగేశారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ ఫీల్ గుడ్ ప్రేమ కథపై జనాల్లో క్రేజ్ ఏర్పడింది. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ వస్తున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్ మెప్పు పొందుతుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్. 

రియాలిటీకి దగ్గరగా ఉండే కథతో రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని జానర్లను టచ్ చేయబోతున్నారు. పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తూ యువ హృదయాల మనసు దోచేలా ఈ మూవీలోని సన్నివేశాలు ఉండనున్నాయట. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ ఈ సినిమాలో హైలైట్ అవుతాయని అంటున్నారు. 

ఈ సినిమాలో రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఎడిటర్‌గా సాయి బాబు తలారి పని చేస్తున్నారు.  వరికుప్పల యాదగిరి పాటలు రచించారు. గురి చూసి ఒక్కటే దెబ్బలో కొట్టేస్తా అంటూ రంగంలోకి దిగిన ఈ కృష్ణ గాడు తన రేంజ్ చూపించడానికి రెడీగా ఉన్నాడు. ఇక మీరు కూడా థియేటర్లలో చూడటానికి రెడీ కండి మరి.

సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి
నిర్మాతలు : పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత
ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్: రాఘవేంద్ర రావు
కథ, కథనం, దర్శకత్వం : రాజేష్‌ దొండపాటి
ఎడిటర్ : సాయి బాబు తలారి
మ్యూజిక్ : సాబు వర్గీస్
డీఓపీ: ఎస్ కె రఫీ 
లిరిక్స్ : వరికుప్పల యాదగిరి
పీఆర్వో : సాయి సతీష్‌

More Press Releases