Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా వాగ్దేవి!

తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా వాగ్దేవి!

తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా వాగ్దేవి!
  • మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 10 లక్షల బహుమానం అందుకున్న వాగ్దేవి
హైదరాబాద్: సంగీత సమరం ముగిసింది. ఎప్పటి నుండో మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ ఎవరవుతారు అన్న ప్రశ్నకు సమాధానం దొరికే రోజు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా వాగ్దేవి ట్రోఫీ ని అందుకొని మొట్ట మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ గా ఒక చరిత్ర రాసింది. 15 వారల సుదీర్ఘ సంగీత ప్రయాణం తర్వాత ఆహా ఈ 17 జూన్ నాడు ఫినాలే టెలికాస్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు, రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి కూడా విచ్చేసి గ్రాండ్ ఫినాలేను కన్నుల పండుగగా మార్చేశారు.

తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవికి ట్రోఫీతో పాటు 10 లక్షల బహుమానం మరియు గీత ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో పాడే అవకాశం కూడా వచ్చింది. మొదటి రన్నరప్ శ్రీనివాస్ కు 3 లక్షలు, రెండో రన్నరప్ వైష్ణవికి 2 లక్షల బహుమానం ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు వైష్ణవి పాటకు మంత్రముగ్ధులయ్యి, తన తర్వాత సినిమా గాడ్ ఫాదర్ లో పాడే అవకాశం ఇచ్చారు.

ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో తెలుగులో మొట్టమొదటిసారిగా ఆహా తీసుకురావడం జరిగింది. ఈ షోకి యాంకర్ గా శ్రీరామ చంద్ర నిర్వహించంగా, న్యాయనిర్ణేతలుగా తమన్, నిత్య మీనన్, మరియు కార్తీక్ ఈ షోని తమ భుజాల మీద వేసుకొని ముందుకు నడిపారు.

ఈ షో విన్నర్ వాగ్దేవి మాట్లాడుతూ, "ఎంతో సంతోషంగా ఉంది. నేను టైటిల్ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో మంది దిగ్గజాల ముందు నేను పాడాను. ఈరోజు చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి నుండి ఎన్నో జ్ఞాపకాలతో పాటు సంగీత జ్ఞానాన్ని కూడా నేను తీసుకొని వెళుతున్నాను. అందుకు నేను తెలుగు ఇండియన్ ఐడల్ మరియు ఆహా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను".

ఆహా సీఈఓ అజిత్ కె ఠాకూర్ మాట్లాడుతూ, "ఆహా ఎప్పుడూ అందరిని అలరించాలని, తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి అహర్నిశలు తోడ్పడుతుంది. తెలుగు ఇండియన్ ఐడల్ అలా వచ్చిన ఒక అలోచన ఇవ్వాళ ప్రభంజనంలా మారి వాగ్దేవి, వైష్ణవి లాంటి యువ గాయనీమణులకు ఒక సరికొత్త జీవితానికి నాంది పలికింది. ఇన్ని రోజులు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు, వాగ్దేవికి అభినందనలు."

విన్నర్ వాగ్దేవికి చందన బ్రదర్స్ వారు 3 లక్షలు, తెనాలి డబల్ హార్స్ 3 లక్షలు బహుకరించారు. రన్నరప్ శ్రీనివాస్ కు తెనాలి డబల్ హార్స్ 2 లక్షలు బహుకరించంగా, చందన బ్రదర్స్ వారు రన్నరప్ వైష్ణవికి 1లక్ష ఇచ్చారు.
Telugu Indian Idol
BVK Vagdevi
Chiranjeevi
Hyderabad

Watch Today's Deals on Amazon

More Press News