వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల వాడకంను తెలియజేసే 'రైతు మార్గదర్శి పుస్తకం'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకి రైతులు వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల వాడకంపై 'రైతు మార్గదర్శి పుస్తకం'ను అందజేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ స్పూర్తితో రైతు మార్గదర్శి పుస్తకాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరికి రైతు సమన్వయ సమితి నాయకులకు పోస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా అందజేయనున్నారు. ఈ పుస్తకంలో యంత్రాలు, పనిముట్ల వివరాలు, లభించు కేంద్రాల వివరాలు మొబైల్ నెంబర్ లతో ముద్రించారు.

More Press Releases