జీ తెలుగు సరికొత్త ధారావాహిక ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ఈ నెల‌ 22న ప్రారంభం

జీ తెలుగు సరికొత్త ధారావాహిక ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ఈ నెల‌ 22న ప్రారంభం
ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్‌ల‌తో సాగే సీరియళ్లను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్ను అందించేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునే కథ, కథనంతో ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు అందిస్తున్న సరికొత్త ధారావాహిక ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. భావోద్వేగాలు, బంధాలు, బాధ్యతలు, కుటుంబ సవాళ్లతో అల్లుకున్న కథతో రూపొందుతున్న ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ఈ నెల‌ 22న ప్రారంభం, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, మీ జీ తెలుగులో!

‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సీరియల్ కథ అనుకోకుండా ముడిపడిన రెండు జీవితాల చుట్టూ తిరుగుతుంది. అనాథగా పెరిగిన తెలివిగల అమ్మాయి శ్రీలక్ష్మి(దర్శిని గౌడ), ఊహించని విధంగా ధనవంతుడైన మధుసూదన్(హర్ష్ నాగ్పాల్) జీవితంలో అడుగుపెడుతుంది. అనేక సమస్యలతో సతమతమయ్యే లక్ష్మి ఆత్మవిశ్వాసంతో మధుసూదన్ ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన ప్రయత్నంలో లక్ష్మి ఎదుర్కొనే ఇబ్బందులేంటి? లక్ష్మి ఎలా మధుసూదన్ మనసు గెలుచుకుంది? అనే విషయాలు తెలియాలంటే ఈ సోమవారం నుంచి జీ తెలుగులో ప్రసారం కానున్న లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ని తప్పకుండా చూడాల్సిందే!

కుటుంబం, ప్రేమ మధ్య సాగే ఆసక్తికర కథాంశంతో సాగే లక్ష్మీ రావే మా ఇంటికి జీ తెలుగు వీక్షకులను అలరించేందుకు సిద్దమైంది. ఈ సీరియల్లో హర్ష్ నాగ్పాల్, దర్శిని గౌడ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, మీర్ సయ్యద్, ఐశ్వర్య, ఇందు ఆనంద్, వెంకట్ గౌడ్,  శ్రీ వాణి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన నటీనటులు, అద్భుతమైన కథాంశం, ఆసక్తికరమైన మలుపులతో సాగే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ని మీరూ మిస్ కాకుండా చూడండి!

ఆకట్టుకునే కథాంశంతో రూపొందుతున్న ‘లక్ష్మీ రావే మా ఇంటికి’.. సోమవారం నుంచి శుక్రవారం వరకు  రాత్రి 10 గంటలకు.. మీ జీ తెలుగులో!

Lakshmi Raave
e Telugu

Watch Today's Deals on Amazon

More Press News