ఏఐ పుస్తకాల రచయిత స్వామి ముద్దం కు మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు
హైదరాబాద్: దేశంలోనే తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) పై పుస్తకాలు రాసిన జర్నలిస్టు స్వామి ముద్దం ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. 'ఏఐ ఫర్ యంగ్ మైండ్స్', 'ఏఐ ఇన్ మోడరన్ జర్నలిజం', 'ఆధునిక జర్నలిజం – ఏఐ' వంటి పుస్తకాలను ముద్దం స్వామి మంత్రి శ్రీధర్ బాబుకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఏఐ పుస్తకాల ఆవిష్కరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్ర స్థాయిలో విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఏఐ పుస్తకాల రచయిత స్వామి ముద్దం మాట్లాడుతూ.. తాను రాసిన పుస్తకాల సబ్జెక్టులను భారత్ ఫ్యూచర్ సిటీలోని ఏఐ యూనివర్సిటీలో ఏఐ కోర్సులకు ఉపయోగించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏఐ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యమిస్తోందని, ఇది తెలంగాణ యువతకు ఉపయోగకరమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎన్ ప్రీతం, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, మాచర్ల కుమారస్వామి, బిజిగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.