"వానర" ఫస్ట్ సింగిల్ 'అదరహో..' రిలీజ్‌

"వానర"  ఫస్ట్ సింగిల్ 'అదరహో..' రిలీజ్‌
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. "వానర" చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్  బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన "వానర" సినిమా ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'అదరహో..' రిలీజ్ చేశారు. పాటను మంచి బీట్ తో కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, భరద్వాజ్ గాలితో కలిసి లిరిక్స్ రాసి పాడారు. 'అదరహో..' పాట ఎలా ఉందో చూస్తే - 'అదర బెదరహో బెదరహో అదరహో, బెదర అదరహో అదరహో బెదరహో..అల్లాటప్పా ఆటలే అల్లాడించే వేటులే కుర్రాడితో వేటలో అబ్బా భలే ఘాటులే..' అంటూ ర్యాప్ స్టైల్ లో సాగుతూ ఆకట్టుకుంటుందీ పాట.

నటీనటులు - అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, నందు, ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి, తదితరులు
Vanara
Avinash Thiruveedhula
Simran Choudhary
Tollywood

More Press News