పాఖాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరించాలి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం!

పాఖాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కాల్వలు శిథిలమైపోయాయని, వీటిని పునరుద్ధరించడం ద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాకతీయులు నిర్మించిన పాఖాల కాల్వలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమే అన్నారు. వెంటనే అంచనాలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
KCR

More Press Releases