Chandrababu Naidu: అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. రాష్ట్రాభివృద్ధి, రాజకీయాలపై చర్చ

Chandrababu Naidu Meets Amit Shah Discusses State Development Politics
  • రాష్ట్రంలోని ప్రాజెక్టుల పురోగతి, పెట్టుబడులపై వివరణ
  • జగన్ పాలనతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి
  • తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు. నిన్న రాత్రి ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో వీరిద్దరి భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతిని చంద్రబాబు అమిత్ షాకు వివరించారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చిందని, లక్షల కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయని తెలిపారు. గత జగన్ ప్రభుత్వ విధ్వంసక పాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదేలైందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు తాను కలిసిన పలువురు కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల వివరాలను కూడా చంద్రబాబు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి అంశాలతో పాటు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు సమాచారం. 
Chandrababu Naidu
Amit Shah
Andhra Pradesh
AP CM
TDP
Andhra Pradesh Politics
Visakhapatnam Investments
AP Development
Jagan Government
Central Government

More Telugu News