జీ తెలుగు తో ఈ వీకెండ్ డబుల్ హంగామా.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో పాటు గణేష్ నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమం ‘జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’!
గణేష్ నవరాత్రుల సందర్భంగా భక్తి, వినోదం, ఉత్సాహంతో ప్రేక్షకులకు పండుగ సంబరం అందించనున్న జీ తెలుగు!
హైదరాబాద్, 18 సెప్టెంబర్ 2026: ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా జీ తెలుగు ప్రేక్షకులకు పండుగ సందడిని మరింత రెట్టింపు చేసేలా ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. వినోదభరితమైన ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో పాటు, పండుగ వైభవాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమం ‘జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’తో ఈ వీకెండ్‌ను డబుల్ హంగామాగా మార్చనుంది.
వీకెండ్ వినోదానికి మరింత జోష్‌ను జోడిస్తూ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సెప్టెంబర్ 20, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. కమల్ తేజ నర్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సీనియర్ హీరో వడ్డే నవీన్ అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చారు. కుటుంబమంతా కలిసి ఆస్వాదించేలా వినోదంతో నిండిన ఈ సినిమా ప్రీమియర్‌తో వీకెండ్ వినోదం మొదలుకానుంది.
ఆ తర్వాత గణేష్ నవరాత్రుల సందర్భంగా జీ తెలుగు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమం ‘జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రేక్షకులను అలరించనుంది. ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తనదైన ఎనర్జీతో కార్యక్రమాన్ని మరింత సందడిగా మార్చనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రోజా, సదా మధ్య పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, జీ తెలుగు పాపులర్ సీరియల్స్‌కు చెందిన పలువురు నటీనటులు కూడా పాల్గొని తమదైన వినోదంతో ప్రేక్షకులను అలరించనున్నారు.
ఆహ్లాదకరమైన ప్రదర్శనలు, సరదా సంభాషణలు, సెలబ్రిటీ సందడి, పండుగ వాతావరణంతో ‘జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’ గణేష్ నవరాత్రుల వేడుకలను ప్రతి ఇంటికీ తీసుకురానుంది. మొత్తంగా సినిమా ప్రీమియర్ నుంచి స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్ వరకు డబుల్ వినోదం, డబుల్ సంబరం, డబుల్ హంగామాతో ఈ వీకెండ్‌ను ప్రేక్షకులకు మరింత ప్రత్యేకంగా మార్చేందుకు జీ తెలుగు సిద్ధమైంది.
జీ తెలుగు సండే స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.. తప్పక చూడండి!