Hatah: హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో "హతః"

హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో "హతః"

హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో "హతః"
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించారు. బ్యానర్ పై ఇటీవల తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో అనుష్ గోరక్ డైరెక్ట్ చేస్తున్నారు. శివశంకర నాయుడు. వై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి "హతః" అనే టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ రోజు ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఒక నల్ల పిల్లిని చూపిస్తూ 'ఈ పిల్లి బతికి ఉందా లేక..' అనే క్యాప్షన్ రాశారు. ఇలాంటి డిఫరెంట్ క్యాప్షన్, టైటిల్ పోస్టర్ తో "హతః" సినిమా ఆసక్తి కలిగిస్తోంది. కొత్త తరహా కథను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు అనే ఇంప్రెషన్ ఈ టైటిల్ పోస్టర్ తో అందరిలో కలుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. 
Hatah
Kiran Abbavaram
cinema news

Watch Today's Deals on Amazon

More Press News