IMDb “బ్రేక్‎అవుట్ స్టార్” స్టార్ మీటర్ అందుకున్న ప్రీతి ముకుందన్

IMDb  “బ్రేక్‎అవుట్ స్టార్” స్టార్ మీటర్ అందుకున్న ప్రీతి ముకుందన్
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మరియు సినిమాలు, టివి షోలు మరియు సెలెబ్రిటీల గురించిన సమాచారము కొరకు అధికారిక మూలం, IMDb, బ్లాస్ట్ మరియు ఇదయం మురళిi లో నటించిన ప్రీతి ముకుందన్ కు IMDb “బ్రేక్‎అవుట్ స్టార్” స్టార్ మీటర్ అవార్డును అందించింది. 2024లో నటనా ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పటి నుండి, ముకుందన్ తమిళం, తెలుగు మరియు మలయాళం సినిమాలలో నటిస్తూ బహుభాషా కెరీర్ ను ఏర్పరచుకుంది. 
 
ఈ అవార్డు IMDb యాప్ పై ప్రచురించబడిన ప్రముఖ భారతీయ సెలెబ్రిటీల జాబితాలో మంచి ప్రతిభను కనబరచే వారిని గుర్తిస్తుంది. ఈ జాబితా, ప్రపంచవ్యాప్తంగా IMDb కి ప్రతినెల 250 మిలియన్లకు పైగా పేజ్ వ్యూస్ నమోదు చేసింది మరియు తమ కెరీర్ లో గొప్ప పురోగతిని సాధించబోయే తారల గురించి ఖచ్ఛితంగా అంచనావేయగలదిగా నిరూపితం అయింది.
 
రెండు నెలల కాలములో ముకుందన్ రెండు తమిళ సినిమాలలో బ్రేక్‎అవుట్ ప్రదర్శనను అందించింది బ్లాస్ట్ ( IMDb వినియోగదారులచే 7.3/10 గా రేట్ చేయబడింది) మరియు ఇదయం మురళి (8.9/10 గా రేట్ చేయబడింది). ఆమె ప్రదర్శనలు IMDb పై ఆమెకు ప్రాచుర్యాన్ని పెంచాయి. ముకుందన్ పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీస్ జాబితాలో ఉత్తమ 10 మందిలో, మొదటి వారములో 2వ స్థానములో మరియు ఆ తదుపరి వారములో 6వ స్థానములో నిలిచింది. ఈ రెండు విజయవంతమైన సినిమాల తరువాత, ఆమె ఉత్సాహం తగ్గకుండా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న మరో అయిదు సినిమాలు చేసింది. ఆమె రాబోయే సినిమాలలో రెలుగు సినిమా ఏమో ఏమో ఇది మరియు అశోక్ సెల్వన్ తో కలిసి పనిచేసిన ఇంకా పేరుపెట్టని తమిళ సినిమా ఉన్నాయి.
 
తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ముకుందన్ “IMDb “బ్రేక్‎అవుట్” స్టార్ మీటర్ అవార్డును అందుకోవడం నాకెంతో ప్రత్యేకమైనది మరియు ఈ క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఇది నేరుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ఆసక్తి మరియు సహకారము నుండి వస్తుంది కాబట్టి ఈ గుర్తింపు నాకెంతో ముఖ్యమైనది. నా ఫ్యాన్స్ నాపై చూపిన ప్రేమకు నేను కృతజ్ఞురాలిని. మీరు లేకపోతే ఈరోజు నేనిక్కడ ఉండేదానిని కాదు మరియు దీని వలన ప్రతిరోజు ఇంకా బాగా చేయాలని, మంచి సినిమాలు చేయాలని మరియు పురోగతి సాధించాలని నాకు ప్రోత్సాహం లభిస్తోంది. IMDb అభిమానిగా నాలోని చిన్న పిల్ల నిజంగా చాలా సంతోషంగా ఉంది మరియు ఇది నాకు చాలా ముఖ్యమైనది. ఈ గుర్తింపు కోసమే నేను చాలా కష్టపడ్డాను.”
 
ఆమె ఇంకా ఇలా చెప్పుకొచ్చారు, “ఒక నటిగా, నేను చేసే పాత్రలు ఒక ప్రభావాన్ని చూపాలి అని ఆశిస్తాను మరియు నా పనికి వచ్చిన స్పందన నేను సరైన మార్గములోనే ఉన్నానని నా హామీ ఇచ్చింది. ఇంకా నేర్చుకోవాలని, నన్ను నేను సవాలు చేసుకోవడం మరియు ప్రజలలో గుర్తిండిపోయే పాత్రలు ఎంచుకోవటానికి ఈ అవార్డు నాకు ప్రేరణ ఇస్తుంది.”
 
ఇదివరకు IMDb “బ్రేక్‎అవుట్ స్టార్” స్టార్ మీటర్ అవార్డు అందుకున్నవారిలో ఆకాశ్ మఖిజ, రమణ్ దీప్ యాదవ్, అంబరీష్ వర్మ, అహాన్ పాండే, అనీత్ పద్దా, మోనికా పన్వర్, జహాన్ కపూర్, కని కుస్రుతి, శార్వరి, నితాంషి గోయల్, ఆదర్శ్ గౌరవ్, అయో ఎడెబిరి, మాయా హాకె మరియు రేగె-జీన్ పేజ్ రేగె-జీన్ పేజ్ ఉన్నారు. 
Preethi Mukundan
IMDB
BREAK OUT STAR
STAR METER

Watch Today's Deals on Amazon

More Press News