‘అమీర్ లోగ్' అంటే ఎవరో సినిమా చూస్తే తెలుస్తుంది: దర్శకుడు రమణా రెడ్డి

‘అమీర్ లోగ్' అంటే ఎవరో సినిమా చూస్తే తెలుస్తుంది: దర్శకుడు రమణా రెడ్డి
'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఆగస్ట్ 21న ఈ మూవీని విడుదల చేయబోతోన్నట్టుగా శనివారం నాడు ప్రకటించారు. రిలీజ్ డేట్‌తో పాటుగా ‘అవ్వల్ దావత్’ సాంగ్‌ని కూడా విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో..

దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ .. ‘‘మాది నల్గొండలోని రాఘవపురం. నేను 97లోనే హైదరాబాద్‌కు వచ్చాను. హైదరాబాద్‌లోని చాలా ఏరియాల్లో జీవించాను. హైదరాబాద్ మనుషుల్ని తెరపై చూపించాలని ‘అమీర్ లోగ్’ తీశాను. మేం ముందుగా మా టీంకి సినిమా వేసి చూపించాము. ఆ తర్వాత స్పిరిట్ మీడియా టీంకి కూడా చూపించాం. వారికి సినిమా నచ్చడంతో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. డబ్బులున్న వారు అమీర్ లోగా?, సంతోషంగా ఉండే వారు అమీర్ లోగా? అన్నది ఈ చిత్రం చూసిన తర్వాత అర్థం అవుతుంది. ఈ సినిమాలో ఫిలాసఫీ ఉంటుంది. అలా అని ఏదో నీతి బోధ చేసినట్టుగా ఉండదు. ఈ మూవీని చూసిన తర్వాత హైదరబాద్ మనుషుల మీద మరింత ప్రేమ, గౌరవం పెరుగుతుంది. ఆగస్ట్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

నిర్మాత మాధవి రెడ్డి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’లో చూపించే బస్తీలోనే నేను పుట్టి పెరిగాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి కారణం నా భర్త రమణా రెడ్డి. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆగస్ట్ 21న మా మూవీ రాబోతోంది. అందరూ మా సినిమాని చూసి ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్లను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి మాట్లాడుతూ .. ‘కల్చర్‌ను ప్రతీకగా తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. హైదరాబాద్‌ను, ఇక్కడి బస్తీలను రమణా రెడ్డి గారు అద్బుతంగా క్యాప్చర్ చేశారు. ‘అమీర్ లోగ్’ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన రాహుల్, కీరవాణి గారికి థాంక్స్. తెలుగు సినిమాల్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది. ఆగస్ట్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

వేదా జలంధర్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ ప్రపంచంలోకి అందరినీ స్వాగతించేందుకు మేం ఈ రోజు ఇక్కడకు వచ్చాం. మా డైరెక్టర్ రమణా రెడ్డి గారు బస్తీలోని అందమైన బంధాలను మరింత అందంగా తెరపై చూపించారు. మూవీని చూసిన వారంతా ఇది మా కథే అని రిలేట్ అవుతారు. ఆగస్ట్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు ఎంసీ హరి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ నుంచి ఇప్పుడు రిలీజ్ చేసిన ‘అవ్వల్ దావత్’ సాంగ్ అదిరిపోయింది. ఆగస్ట్ 21న మా సినిమా రాబోతోంది. థియేటర్లోకి వచ్చిన తరువాత మా ప్రపంచంలోకి, మా బస్తీలోకి తీసుకు వెళ్తాం. అందరినీ ఆకట్టుకుంటాం’ అని అన్నారు.
Ameer Log
Ramana Reddy
Tollywood
cinema

Watch Today's Deals on Amazon

More Press News