త్రిగుణ్ హీరోగా ‘ఆకర్షిత’ చిత్రం ప్రారంభం

త్రిగుణ్ హీరోగా  ‘ఆకర్షిత’ చిత్రం ప్రారంభం
లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా ‘ఆకర్షిత’ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శనివారం (ఫిబ్రవరి 21) ఘనంగా జరిగాయి. త్రిగుణ్ హీరోగా పదినే కుమార్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ మూవీలో రాజ్ కుమార్  కసిరెడ్డి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, రవివర్మ, ప్రియా ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాకి సూరిశెట్టి కిషోర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షేక్ హజారత్ (వలి) కెమెరామెన్‌గా పని చేయనున్నారు. ఈ పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, వేణు స్వామి, ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్, సి. కళ్యాణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

శనివారం నాడు జరిగిన ఈ పూజా కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ప్రముఖ జ్యోతిశ్య నిపుణులు వేణు స్వామి స్క్రిప్ట్‌ను అందజేశారు. బేబీ ఆష్కా, కీర్తనలు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటి ప్రియ చిత్రానికి సంబంధించిన ‘ఆకర్షిత’ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో త్రిగుణ్, కసిరెడ్డి, సత్యం రాజేష్, అదుర్స్ రఘు, రవివర్మ, ప్రియా పాల్గొని సందడి చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో..

హీరో త్రిగుణ్ మాట్లాడుతూ .. ‘లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కొత్త దర్శకుడు కిషోర్ మంచి కథతో సినిమాని తీస్తున్నారు. ఈ మూవీని సందీప్, శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. వీరందరికీ ఇది మొదటి చిత్రం. మంచి సినిమాతో మేమంతా రాబోతోన్నాం. మా కోసం వచ్చిన సి. కళ్యాణ్ గారికి, వంశీ నందిపాటి గారికి, వేణు స్వామి గారికి, దాము గారికి థాంక్స్. ఈ చిత్రంలో నేను హీరోని కాదు కసిరెడ్డి హీరో. కసిరెడ్డితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీలో మాతో పాటుగా రవి వర్మ గారు, రఘు గారు, ప్రియా గారు నటిస్తున్నారు. ఈ రోజు మేం మా ‘ఆకర్షిత’ టైటిల్‌ను రివీల్ చేశాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ఇతర అప్డేట్లు త్వరలోనే ఇస్తామ’ని అన్నారు.

దర్శకుడు సూరిశెట్టి కిషోర్ మాట్లాడుతూ .. ‘మా ‘ఆకర్షిత’ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. సీతమ్మని తీసుకు రావడానికి రాముడికి వారధి అవసరమైంది. మా సినిమాని జనాల వరకు తీసుకెళ్లడానికి మీడియా వారధిలా మాకు సపోర్ట్ చేస్తోంది. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత సందీప్ యాదవ్ మాట్లాడుతూ .. ‘మా ‘ఆకర్షిత’ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి థాంక్స్. ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన మీడియా వారికి థాంక్స్. మున్ముందు మా సినిమాకు సంబంధించిన ఇతర అప్డేట్లను ప్రకటిస్తామ’ని అన్నారు.

 నటీనటులు : త్రిగుణ్, పదినే కుమార్, అదుర్స్ రఘు, కసిరెడ్డి రాజ్ కుమార్, సత్యం రాజేష్, రవి వర్మ, బలగం జయరాం తదితరులు


Aakarshitha
Thrigun
Tollywood
cinema

More Press News