"మార్కండేయ" టైటిల్ గ్లింప్స్ విడుదల

"మార్కండేయ" టైటిల్ గ్లింప్స్ విడుదల
యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'దిల్ రాజు డ్రీమ్స్' అనే బ్యానర్ స్థాపించారు. ఈ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా యంగ్ హీరో విక్రాంత్ తో "మార్కండేయ" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ కెరీర్ కు దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ నిర్మిస్తున్న తొలి చిత్రంలో హీరోగా నటిస్తుండటం మంచి అడ్వాంటేజ్ కానుంది. ఈ సినిమాను మైథలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సిస్ట్లా వీఎంకే రూపొందిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో "మార్కండేయ" మూవీ టైటిల్ గ్లింప్స్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

డైరెక్టర్ సిస్ట్లా వీఎంకే మాట్లాడుతూ - మా లాంటి కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చి నిలబెడుతున్న దిల్ రాజు గారికి ఆయన టీమ్ అందరికీ థ్యాంక్స్. బాగా కష్టపడాలి అని ఇందాక దిల్ రాజు గారు నాతో చెప్పారు. ఆ మాటను మర్చిపోలేను, మాపై రాజు గారు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. మేము ఈ సినిమాకు ఏఐని ఒక సపోర్ట్ గా వాడాం తప్ప ఏఐ నుంచి చేసిన షాట్స్ ఎక్కడా మూవీలో పెట్టలేదు. విక్రాంత్ నాకు మార్కండేయ, నేను ఆ పేరుతోనే పిలుస్తాను. ఈ మూవీ కోసం మా మధ్య ఎన్నో మంచి డిస్కషన్స్ జరిగాయి. ఈ రోజు నుంచి విక్రాంత్ మీ అందరి మార్కండేయ అయిపోయారు. అన్నారు.

హీరో విక్రాంత్ మాట్లాడుతూ - హాలీవుడ్ లో మల్టీవెర్స్, సూపర్ హీరో మూవీస్ గత కొన్నేళ్లుగా విరివిగా వస్తున్నాయి. కానీ మన పురాణాల్లో వేల ఏళ్ల నుంచే అనంత కోటి బ్రహ్మాండాలు, చిరంజీవులు వంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇతిహాసాల నుంచి తీసుకున్న అలాంటి ఒక కథకు ఆధునిక రూపమే మా మూవీ. ఇతిహాసాల నుంచి తీసుకున్న కథతో మేము చేస్తున్న ఒక మిస్టిక్ థ్రిల్లర్ మూవీ మార్కండేయ. ఈ మూవీ కోసం ఒక యంగ్ టీమ్ ను తీసుకుని ప్లాన్ చేశాం. అయితే ఇలాంటి మూవీకి ఒక గైడెన్స్ సపోర్ట్ కావాలి. యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు దిల్ రాజు గారు దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ ఫామ్ క్రియేట్ చేశారు. మేము మా కథ ఆయనకు చెప్పి, చేసిన కంటెంట్ చూపించాం. దిల్ రాజు గారికి నచ్చి మా సినిమాను దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - 23 ఏళ్లలో 60 చిత్రాలు కంప్లీట్ చేసిన మా ఎస్వీసీ సంస్థకు దిల్ రాజు డ్రీమ్స్ అనేది మరో విభాగం. మా బ్యానర్ గురించి మీ అందరికీ తెలిసిందే. మేము స్టార్స్ తో 10 సినిమాలు చేస్తే అందులో 2 మూవీస్ ఆదరణ పొందలేదు. మిడ్ రేంజ్ హీరోలు, స్మాల్ ఫిలింస్ తో 70 శాతం విజయాలు అందుకున్నాం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తెలిసీ తెలియక పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాను. ఆ తర్వాత పెళ్లిపందిరి సినిమా మమ్మల్ని నిలబెట్టింది. విక్రాంత్ హీరోగా చేసిన మొదటి సినిమాకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయాడు. 

ఆ తర్వాత సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి గారితో కలిసి చేసి లాభాలు చూశాడు. రెండో సినిమాకే తను జాగ్రత్తపడటం నేర్చుకున్నాడు. ఈ మార్కండేయ మూవీ కోసం విక్రాంత్ నన్ను అప్రోచ్ అయ్యాడు. అతనికి బిజినెస్ లు ఉన్నాయి. అవన్నీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. హీరోగా కూడా సక్సెస్ కావాలనే తపన విక్రాంత్ లో కనిపించింది. మార్కండేయ మూవీలోని కంటెంట్ నచ్చి ఈ చిత్రాన్ని మా దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో మొదటి చిత్రంగా టేకప్ చేశాం. సీజీ వర్క్ ఎక్కువగా ఉన్న చిత్రమిది. ఈ సినిమాను వచ్చే ఏడాది మహాశివరాత్రికి విడుదల చేస్తాం. అన్నారు. 


Markandeya
Dil Raju
DilRaju Dreams
Vikranth
Tollywood

More Press News