"సంతాన ప్రాప్తిరస్తు'కు ప్రేక్షకులు విజయాన్నిఅందించారు: మధుర శ్రీధర్ రెడ్డి
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ నుంచి ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ మూవీ టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో
డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - ఏడాదిన్నర పాటు ఈ సినిమాకు పడిన కష్టం మర్చిపోయే విజయాన్ని ప్రేక్షకులు అందించారు. మీడియా నుంచి వచ్చిన ప్రశంసలతో పాటు చిన్న చిన్న సజెషన్స్ కూడా తీసుకుంటాం. మా హీరో తన సెకండ్ మూవీకే ఇలాంటి ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ను యాక్సెప్ట్ చేశాడు. బరువు పెరిగి డీ గ్లామర్ గా నటించాడు. ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. చాందినీ చౌదరి ప్రామిసింగ్ రోల్ చేసింది. తను ఈ క్యారెక్టర్ కు లైఫ్ ఇచ్చింది. నేను అనుకున్న కాన్సెప్ట్ ను రాజీ పడకుండా స్క్రీన్ మీదకు తీసుకొచ్చేందుకు మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారు, హరి ప్రసాద్ గారు సపోర్ట్ ఇచ్చారు. డీజే టిల్లులో తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ గారికి ఎంత పేరొచ్చిందో మా మూవీలో చైతన్య మామగారి క్యారెక్టర్ లో అంత రెస్పాన్స్ వస్తోంది. మరోసారి మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - మా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం. సినిమాను ఆడియెన్స్ దగ్గరకు రీచ్ చేసేందుకు మా పీఆర్ఓస్ చాలా కష్టపడ్డారు. లగడపాటి శ్రీధర్ గారు ఈ రోజు మా సక్సెస్ మీట్ కు రావడం సంతోషంగా ఉంది. ఆయన నన్ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన వ్యక్తి. ఈ సినిమా టైమ్ లో కూడా తన సపోర్ట్ అందించారు. హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ తమ బెస్ట్ వర్క్ ఈ సినిమాకు ఇచ్చారు. ప్రతి సందర్భంలో సినిమాను నమ్మి నిలబడ్డారు. మురళీధర్ గౌడ్ గారు మా సినిమాకు పెద్ద అసెట్ అవుతారని స్క్రిప్ట్ టైమ్ లోనే అనుకున్నాం. అనుకున్నట్లే ఆయన క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ప్రాడక్ట్ కు పాజిటివ్, నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి. మేము పాజిటివ్ ను తీసుకుని ముందుకు వెళ్తున్నాం. మా మూవీ వచ్చే ఆదివారం వరకు రూ. 6.5 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం. మా లాంటి చిన్న చిత్రానికి ఇది పెద్ద బాక్సాఫీస్ నెంబర్ అనుకోవచ్చు. అన్నారు.
హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ - మా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను మీరంతా ఇష్టపడతారని అనుకున్నాము గానీ ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదు. నేను చేసిన కల్యాణి పాత్రకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మూవీ ప్రమోషన్స్ లో టూర్స్ కు వెళ్లినప్పుడు ఆడియెన్స్ కల్యాణి క్యారెక్టర్ తమకు బాగా నచ్చిందని చెబుతున్నారు. ఇలాంటి గుడ్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఆ పాత్రను అందరికీ నచ్చేలా తీర్చిదిద్దిన ఘనత మా డైరెక్టర్ సంజీవ్ గారిదే. ఆ తర్వాత షేక్ దావూద్ గారు తన రైటింగ్ తో మా మూవీకి మరో పిల్లర్ లా నిలిచారు. హీరో విక్రాంత్ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. అతనికి మరిన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ దక్కాలని కోరుకుంటున్నా. నాకు ఈ మూవీ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారికి, హరి ప్రసాద్ గారికి థ్యాంక్స్. అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ - మూవీ కోసం పడిన కష్టాన్ని మర్చిపోయే విజయాన్ని ప్రేక్షకులు అందించారు. ఈ సినిమాకు మూడు పిల్లర్స్ ఎవరంటే మా డైరెక్టర్ సంజీవ్, రైటర్స్ షేక్ దావూద్, కల్యాణ్ రాఘవ్ అని చెప్పాలి. వాళ్లు ప్రతి సీన్ లో ఎలాంటి ఎమోషన్ కనెక్ట్ చేయాలి, ఎలాంటి ఫన్ ఇవ్వాలి, ఈ సీన్ ను ఎలా ల్యాండ్ చేయాలని ఎంతో శ్రద్ధగా క్రియేట్ చేశారు. ఈ సినిమాతో నాకు ఒక ఫ్యామిలీని మీట్ అయినట్లు ఉంది. చాందినీ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. తను నాకు ఒక స్నేహితురాలిగా మారిపోయింది. హరి ప్రసాద్ గారు, శ్రీధర్ గారు సోదరుల్లా మారిపోయారు. మురళీధర్ గౌడ్ గారిని బయట కూడా మామా అనే పిలుస్తున్నా. ఇలాంటి బాండింగ్ తో మేమంతా చేసిన మూవీ ఆశించిన సక్సెస్ అందించింది. ప్రేక్షుకులు పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడాలని కోరుతున్నా. మీరు థియేటర్స్ కు వెళ్తేనే మా లాంటి కొత్త హీరోస్ కు లైఫ్ ఉంటుంది. మా మూవీకి మీరు ఇస్తున్న కలెక్షన్స్ తో హ్యాపీగా ఉన్నాం. అన్నారు.