The Great PreWedding Show: ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’.. 3 రోజుల్లో..

‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’.. 3 రోజుల్లో రూ.2.22 కోట్లు వ‌సూలు చేసిన ఫ‌న్ రైడ‌ర్‌

‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’.. 3 రోజుల్లో రూ.2.22 కోట్లు వ‌సూలు చేసిన ఫ‌న్ రైడ‌ర్‌
వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. 

మంచి కంటెంట్  సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు చాలా గొప్ప‌గా ఆద‌రిస్తార‌ని ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ మ‌రోసారి ప్రూవ్ చేసింది. ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు, మీడియా నుంచి సినిమాకు అమేజింగ్ అంటూ రెస్పాన్స్ రావటం విశేషం.  లిమిటెడ్ బ‌డ్జెట్‌లో.. లిమిటెడ్ స్క్రీన్స్‌లో రిలీజైన ఈ సినిమాకు తొలి ఆట నుంచి సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చింది. సినిమా చూసిన అంద‌రూ సినిమాలో  న‌టీన‌టుల‌ను, సాంకేతిక నిపుణుల‌ను.. సినిమా కథ‌ను తెర‌కెక్కించిన విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమాకు వ‌స్తోన్న హిట్ టాక్‌తో నేటి నుంచి మ‌రికొన్ని స్క్రీన్స్ పెర‌గున్నాయి. తొలి మూడు రోజుల్లో సినిమా రూ.2.22 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేయ‌టం విశేషం. 

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి ఫ్యామిలీ ఫ‌న్ రైడ‌ర్‌ను చూడ‌లేద‌ని ప్రేక్ష‌కులు అభినందిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ రమేష్ పాత్రలో తిరువీర్ అందరినీ నవ్వించారరు. ఓ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌ వల్ల ఏర్పడిన గందరగోళంతో ఏర్పడే హాస్యం అందరినీ అలరించింది. సిట్యుయేషనల్ కామెడీ, మంచి ఎమోషన్స్‌ను మిళితం చేసి ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ అన్ని వర్గాల ప్రేక్షకులను థియేట‌ర్స్‌కు ర‌ప్పిస్తోంది. 


The Great PreWedding Show
ThiruveeR
The Great Pre-Wedding Show collections
tollywood

Watch Today's Deals on Amazon

More Press News