జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్-1.. శనివారం సాయంత్రం 5 గంటలకు మీ జీ తెలుగులో..!

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్-1.. శనివారం సాయంత్రం 5 గంటలకు మీ జీ తెలుగులో..!
నిరంతరం ప్రేక్షకులకు వినోదం అందిస్తూ రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్న ఛానల్ జీ తెలుగు. అచంచలమైన అంకితభావంతో అలరిస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడంలో జీ తెలుగు ఎదుగుదల కొనసాగుతూనే ఉంది. జీ తెలుగు ఉన్నతికి కృషి చేస్తున్న ప్రతిభావంతులైన నటీనటులు, కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలకు ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డులను ప్రదానం చేస్తూ అదే ఉత్సాహంతో ముందుకు సాగాలని ప్రోత్సహిస్తుంది. ప్రతి ఏటా ఘనంగా జరిగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుక ఈ సంవత్సరం ‘వసుధైవ కుటుంబం’ నేపథ్యంతో మరింత వైభవంగా జరుగనుంది.  జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్‌‌-1, రెడ్ కార్పెట్ పై బుల్లితెర తారలు, వెండితెర ప్రముఖుల సందడి అక్టోబర్ 10, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు,  ప్రతిష్టాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మొదటి భాగం అక్టోబర్ 11, శనివారం సాయంత్రం 5 గంటలకు, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!

జీ తెలుగు ఇరవై సంవత్సరాల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఈ ఏడాది జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 వేడుక ఆసక్తికరంగా సాగనుంది. అక్టోబర్ 10, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానున్న రెడ్ కార్పెట్ కార్యక్రమంలో అందంగా ముస్తాబైన టాలీవుడ్ తారలు, ప్రముఖులు, బుల్లితెర నటీనటులు, ప్రత్యేక అతిథులు సందడి చేయనున్నారు. అంగరంగ వైభవంగా జరగనున్న జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ కార్యక్రమం మొదటి భాగానికి ఎనర్జిటిక్ యాంకర్స్ ప్రదీప్ మాచిరాజు- శ్రీముఖి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ప్రదీప్ కామెడీ పంచ్లు, శ్రీముఖి ఆకట్టుకునే మాటల కలబోతతో ఈ కార్యక్రమం ఆహ్లాదభరితంగా సాగనుంది. జీ తెలుగు నటీనటులు తమ సీరియల్ కుటుంబాలతో కలిసి వేదికపైకి రావడంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రదీప్, శ్రీముఖి వారిని పరిచయం చేస్తూ వారు నటిస్తున్న సీరియల్స్ కథల నేపథ్యాన్ని వివరిస్తూ ప్రేక్షకులను అలరిస్తారు.

అద్భుతమైన ప్రదర్శనలు, అలరించే కామెడీ పంచులతో సాగే ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ కళ్లకు గంతలు కట్టుకుని తన సౌందర్యలహరిని వెతుకుతాడు. అందరు అమ్మాయిల మధ్య ఉన్న తన భార్య ఊహని కనిపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. జీ తెలుగు సీరియల్ హీరోయిన్లు వారికి పలు బహుమతులు అందిస్తారు. అంతేకాదు, శ్రీకాంత్ 90వ దశకంలో తనతో నటించిన హీరోయిన్లు లయ, ఇంద్రజ, రాశి, లైలా, ఇతరులతో కలిసి డాన్స్ చేసి అలరిస్తారు. ప్రముఖ నటుడు అలీ, ఇంద్రజ తమ ఫేమస్ సాంగ్ ‘నీ జీన్సు ప్యాంటు చూసి బుల్లెమ్మో’ పాటకు మరోసారి జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేదికపై నర్తించి అందరినీ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తారు.  సీరియల్ హీరోహీరోయిన్లు చేసిన అద్భుతమైన డాన్స్ ప్రదర్శనలు, అవార్డ్స్ అందుకున్న అనంతరం పలువురు నటీనటులు చేసే భావోద్వేగభరిత ప్రసంగాలు ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన ప్రదర్శనలతో వినోదంగా సాగే ఈ కార్యక్రమంలో మీ అభిమాన నటులు ఏ అవార్డు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే మిస్ అవకుండా చూడాల్సిందే.


అంగరంగ వైభవంగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్‌‌-1 ఈ శనివారం సాయంత్రం 5 గంటలకు.. మీ జీ తెలుగులో, మిస్ కాకుండా చూడండి!
Zee Telugu Kutumbam Awards 2025

More Press News