బకాసుర రెస్టారెంట్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన దర్శకుడు హరీశ్‌ శంకర్‌

బకాసుర రెస్టారెంట్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన  దర్శకుడు హరీశ్‌ శంకర్‌
పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌', ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'అయ్యో ఏమీరా ఈ జీవితం' అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ను బ్లాక్‌బస్టర్‌ మాస్‌ దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించాడు. 

ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ '' ఇదొక యూత్‌ఫుల్‌ సాంగ్‌. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్వరంతో ఈ పాటకు మరింత వన్నె తెచ్చాడు. వికాస బడిస స్వరాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందిఅతి త్వరలో చిత్ర విడుదల తేదిని ప్రకటిస్తాం' అన్నారు. 







Bakasura Restaurant
Praveen
Viva harsha
Ayyo emi ra ee Jeevitham
Tollywood

Watch Today's Deals on Amazon

More Press News