డేవిడ్ వార్నర్ నటించిన రాబిన్హుడ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, సరికొత్త ధారావాహిక ఘరానా మొగుడు ప్రారంభం!

Related image


హైదరాబాద్, 08 మే 2025: తెలుగు ప్రేక్షకులకు ఇరవై నాలుగు గంటలు నాన్స్టాప్ వినోదం అందించే జీ తెలుగు ఈ వారం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్ హిట్ సినిమా ‘రాబిన్హుడ్’ ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది. చిన్నపిల్లల్లోని నటనా ప్రతిభను వెలికితీస్తూ అశేష ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న డ్రామా జూనియర్స్ 8 ఈ వారం మాతృదినోత్సవం ప్రత్యేక ఎపిసోడ్తో అలరించేందుకు సిద్ధమైంది. ప్రారంభం నుంచీ జీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఈ వారం ఫినాలేకి చేరుకుంది. అంతేకాదు కుటుంబ కథతో పవన్ సాయి, అక్షిత, భావన ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న సరికొత్త సీరియల్ ఘరానా మొగుడు ప్రారంభంకానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్హుడ్ ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు, డ్రామా జూనియర్స్ 8 మాతృదినోత్సవ ప్రత్యేక ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు, సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలే ఆదివారం రాత్రి 9 గంటలకు, సరికొత్త ధారావాహిక ఘరానా మొగుడు మే 12న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో! 

రాబిన్‌హుడ్ సినిమా కథ ఒక అనాథ అయిన రామ్ (నితిన్) చుట్టూ తిరుగుతుంది. అతను ఆకలితో బాధపడుతున్న తోటి అనాథల దుస్థితిని చూసి సంపన్నుల నుంచి డబ్బు దొంగిలించి అవసరమైన వాళ్లకి పంచిపెడతాడు. విలన్ వాసుదేవ్ (దేవదత్త నాగే) తన అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించాలని ప్లాన్ చేస్తాడు. వాసుదేవ్ కుమార్తె రీనా వాసుదేవ్ (శ్రీలీల) రుద్రకొండకు వెళ్తుంది. రామ్ మరియు వాసుదేవ్ కలిసినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్లిద్దరి మధ్య సంబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే జీ తెలుగు వేదికగా ప్రసారం కానున్న రాబిన్హుడ్ సినిమా చూడాల్సిందే!

వెంకీ కుడుముల దర్శకత్వంలో, నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో నితిన్, శ్రీలీల, దేవదత్త నాగే, సిజ్జు, డేవిడ్ వార్నర్ ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని మీరూ తప్పకుండా చూసేయండి. 

వారం వారం వినోదభరితమైన స్కిట్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డ్రామా జూనియర్స్ 8 ఈ వారం మరో ప్రత్యేక ఎపిసోడ్తో వచ్చేస్తుంది. మాతృదినోత్సవం సందర్భంగా అనిల్ రావిపూడి తల్లి ఈ షోలో పాల్గొననున్నారు. మరి మీరూ ఈ ఎపిసోడ్ని మిస్ కాకుండా చూడండి. ఇక, ప్రతి శనివారం ఆటపాటలతో ప్రేక్షకులకు వినోదం పంచుతున్న జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలేకు చేరకుంది. 16 సీరియల్స్ టీమ్స్తో ప్రారంభమైన పోటీలో టైటిల్పోరులో పడమటి సంధ్యారాగం, కలవారికోడలు కనకమహాలక్ష్మి సీరియల్స్ టీమ్స్ తలపడనున్నాయి. ఇక ఈ ఎపిసోడ్లో రోజా, మంచు లక్ష్మి పాల్గొని మరింత వినోదం పంచారు.  

అంతేకాదు! జీ తెలుగు మే 12న మరో కొత్త ధారావాహిక ఘరానా మొగుడు ప్రారంభిస్తోంది. ఈ సీరియల్ కుటుంబం, ప్రేమ ముఖ్యనేపథ్యాలుగా తెరకెక్కుతోంది. ఈ సీరియల్ కథ వెంకటేష్ నాయుడు (పవన్ సాయి) చుట్టూ తిరుగుతుంది. అతను తన స్వస్థలానికి తిరిగి వచ్చినప్పుడు, తాను స్థానిక వ్యాపార వారసుడని తెలుసుకుంటాడు. అయితే, అతని అత్త అఖిలాండేశ్వరి (భావన), మరదలు మ్యాగీ (అక్షిత) ప్రస్తుతం ఆ వ్యాపారాన్ని చూసుకుంటున్నారని తెలుసుకుంటాడు. వెంకటేష్ తన వ్యాపారాన్ని తిరిగి ఎలా దక్కించుకుంటాడు? అఖిలాండేశ్వరిని ఎలా ఎదుర్కొంటాడు? అనే విషయాలు తెలియాలంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే ఘరానా మొగుడు సీరియల్ మిస్కాకుండా చూడండి!
ప్రతిభావంతులైన నటీనటులు, ఆకట్టుకునే కథతో ఘరానా మొగుడు సీరియల్ జీ తెలుగు వీక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్ సాయి, అక్షిత ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, భావన, తేజల్, శరత్ చంద్ర, సుచిత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

ఈ శనివారం నుంచి సోమవారం వరకు వరుస కార్యక్రమాలతో వినోదం పంచేందుకు సిద్ధమైన జీ తెలుగు.... మీరూ మిస్కాకండి! 

David Warner

More Press Releases