Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి అతిథులుగా..

విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి అతిథులుగా ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’... ఈ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు, మన కాకినాడలో!

విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి అతిథులుగా ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’... ఈ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు, మన కాకినాడలో!
కాకినాడ, 26 డిసెంబర్ 2024 : నిరంతరం వినోద కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు రెండు రాష్ట్రాల్లోని ముఖ్యపట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బుల్లితెర అభిమానులను పలకరిస్తోంది. ఈ ఏడాది వరుస ఈవెంట్లతో అలరించిన జీ తెలుగు 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. తెలుగువారి పెద్ద పండగైన సంక్రాంతిని మరింత సంబరంగా జరుపుకునేందుకు మన కాకినాడకు వచ్చేస్తోంది. హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ముఖ్యఅతిథులుగా సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ ‘సంక్రాంతి సంబరాలకు వస్తున్నాం’ అంటూ కాకినాడలో సంక్రాంతి సంబరాలు చేయనుంది జీ తెలుగు. ‘సంక్రాంతికి వచ్చేస్తున్నాం’ మూవీ టీమ్ సందడి చేయనున్న జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’ డిసెంబర్ 28 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు.. మన కాకినాడలో!


 కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల(P.R Government college) గ్రౌండ్ వేదికగా జీ తెలుగు సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బుల్లితెర అభిమానుల సందడితో కోలాహలంగా జరగనున్న ఈ కార్యక్రమానికి యాంకర్ రవి వ్యాఖ్యాత గా వ్యవహరించనుండగా జీ తెలుగు సీరియల్స్ నటీనటులు సందడి చేయనున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టీమ్ కూడా పాల్గొని అభిమానులను అలరించనుంది. హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరితోపాటు సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, ఆమని, శ్రీలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. బుల్లితెరపై నటనతో అలరిస్తున్న జీ తెలుగు తారలు తమ అభిమానులతో కలిసి సంక్రాంతి జరుపుకునేందుకు మన కాకినాడ వచ్చేస్తున్నారు. మరి మీరూ జీ తెలుగు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మీ అభిమాన తారలను నేరుగా పలకరించే అవకాశం పొందండి.
జీ తెలుగు సంక్రాంతి సoబంరం ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’... ఈ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు, మన కాకినాడలో !


Sankranthiki Vasthunam
Venkatesh Daggubati

Watch Today's Deals on Amazon

More Press News