జీ5లో న‌వంబ‌ర్ 28న తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ‘వికటకవి’

జీ5లో న‌వంబ‌ర్ 28న తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ‘వికటకవి’
నరేష్‌ ఆగస్త్య, మేఘా ఆకాష్‌ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ 'వికటకవి'. తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న మొట్టమొదటి వెబ్‌ సీరిస్‌ ఇది.  ఈ సీరిస్‌ను ZEE5లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై  ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు.  

దర్శకుడు సీరిస్‌ నేపథ్యాన్ని వివరిస్తూ '' హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. కొన్ని కార‌ణాల‌తో అమరగిరి ప్రాంతంలోని స‌మ‌స్య‌ను గుర్తించ‌టానికి డిటెక్టివ్ రామకృష్ణ వెళతాడు. త‌న తెలివి తేట‌ల‌తో ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలను, అధునిక కుట్రల వెనుకున్న రహస్యాలను అతను వెలికితీస్తాడు.  ఈ ప్రయాణంలో తనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అమ‌రిగిరి ప్రాంతంతో రామ‌కృష్ణ‌కు ఉన్న అనుబంధం ఏంట‌నేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే'' అన్నారు. అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


Vikkatakavi
Zee5

Watch Today's Deals on Amazon

More Press News