Varun Tej: వరుణ్‌తేజ్‌ మట్కా రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌

వరుణ్‌తేజ్‌ మట్కా రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌

వరుణ్‌తేజ్‌ మట్కా రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌
వరుణ్ తేజ్  పీరియడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మట్కా'.  కరుణకుమార్‌ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో వుంది. ప్రస్తుతం, టీమ్ వరుణ్ తేజ్, ఫైటర్స్‌తో కూడిన చాలా కీలకమైన, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తోంది.  వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న 'మట్కా' వరుణ్ తేజ్‌కి మోస్ట్ హై బడ్జెట్ మూవీ.

ప్రొడక్షన్ చివరి దశలో వుండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరగడంతో 'మట్కా' మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం కార్తీక పూర్ణిమకు ముందుగా నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది, సినిమాకి లాంగ్ వీకెండ్‌ అడ్వాంటేజ్ వుంటుంది. కరుణ కుమార్ ఈ కథ కోసం  1958, 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకున్నారు. వరుణ్ తేజ్‌ని నాలుగు డిఫరెంట్ అవతార్స్ లో ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్ లో వరుణ్ తేజ్ వైవిధ్యమైన అలరించాయి. 
Varun Tej
Matka

Watch Today's Deals on Amazon

More Press News