Ashok galla: నమ్రతా క్లాప్‌తో అశోక్‌ గల్లా కొత్త చిత్రం..

నమ్రతా క్లాప్‌తో అశోక్‌ గల్లా కొత్త చిత్రం ప్రారంభం

నమ్రతా క్లాప్‌తో అశోక్‌  గల్లా కొత్త చిత్రం ప్రారంభం
భారీ సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నూతనంగా మరో చిత్రం ప్రారంభించింది.యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.27 చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.అమెరికా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు ఉద్భవ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు.నమ్రత ఘట్టమనేని ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా మరియు మంజుల స్వరూప్ తమ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అశోక్ గల్లాతో పాటు 'మ్యాడ్' ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ, 'కోట బొమ్మాళి పి.ఎస్' ఫేమ్ రాహుల్ విజయ్, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రంలో కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు, హృదయాన్ని హత్తుకునే డ్రామా ఉంటుంది. సెప్టెంబర్ నెలాఖరు నుంచి  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం' అన్నారు. 
 
Ashok galla
Sithara Entertainments
Naga vamshi
Namratha

Watch Today's Deals on Amazon

More Press News