పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ‘కలియుగం పట్టణం’.. మార్చి 22న విడుదల

Related image

టాలీవుడ్‌లో యంగ్ మేకర్లు వండర్లు క్రియేట్ చేస్తున్నారు. కొత్త దర్శకులు భిన్న కథలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను తీస్తూ విజయాలు అందుకుంటున్నారు. కొత్త తరహా చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నాని మూవీ వర్క్స్ మరియు రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణం’ అనే ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

టాలీవుడ్‌లో ఇది వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌తో మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొదించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. కడప జిల్లాలోనే షూటింగ్‌ను ఫినిష్ చేశారు.  45 రోజుల కాల వ్యవధిలో సినిమా షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా, విజయవంతంగా పూర్తి చేశామని, అందుకు సహకరించిన యూనిట్‌కు థాంక్స్ చెప్పారు నిర్మాత.


ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మార్చి 22న ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి.

ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ వంటి టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అజయ్ అరసాడ సంగీతాన్ని అందించగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల వంటి వారు పాటలకు సాహిత్యాన్ని అందించారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నారు.

నటీనటులు :  విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్,  చిత్రా శుక్లా తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
నిర్మాతలు : డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌
దర్శకుడు : రమాకాంత్ రెడ్డి
సంగీత దర్శకుడు : అజయ్ అరసాడ
కెమెరామెన్ : చరణ్ మాధవనేని
సాహిత్యం : చంద్రబోస్, భాస్కర భట్ల
ఎడిటర్ : గ్యారీ బీహెచ్
పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు

More Press Releases