బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గదర్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో!

Related image

హైదరాబాద్, 13 ఫిబ్రవరి 2024: తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ పొందిన ఛానళ్లలో ఒకటైన జీ తెలుగు తన ప్రేక్షకులను అలరించేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు మరో బ్లాక్బస్టర్ హిట్ని ఈ ఆదివారం కానుకగా అందించనుంది. 2023లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన గదర్ 2ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా తెలుగులో ప్రసారం చేయనుంది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గదర్ 2,  ఫిబ్రవరి 18 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, మీ జీ తెలుగులో!

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న గదర్ 2 సినిమాను తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం చేయనుంది. అనిల్ శర్మ దర్శకత్వంలో 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ నటించిన ఈ చిత్రం 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో తారా సింగ్ (సన్నీ డియోల్) ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కింది. జైలులో ఉన్న తన కుమారుడు చరణ్జీత్ సింగ్ (ఉత్కర్ష్ శర్మ) ను రక్షించడానికి పాకిస్థాన్ నుంచి తిరిగివచ్చిన తారా సింగ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ.

థియేట్రికల్ రిలీజ్ సక్సెస్ తర్వాత ఫిబ్రవరి 18న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానున్న 'గదర్ 2' ప్రేక్షకులకు అదిరిపోయే వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. కాబట్టి, తెలుగు ప్రీమియర్గా ప్రసారం కానున్న బాలీవుడ్ బ్లాక్బస్టర్ సినిమా గదర్ 2ని జీ తెలుగు వేదికగా ఈ వారాంతంలో మీరూ మిస్సవకుండా వీక్షించండి!

బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ సృష్టించిన గదర్ 2- తెలుగులో, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!


More Press Releases