'హాస్య బ్రహ్మ' బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా 'హ్రశ్వ దీర్ఘ' చిత్రం నుండి ఆయన ఫస్ట్ లుక్ అలాగే రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల

Related image

ఈరోజు హాస్య బ్రహ్మ పుట్టినరోజు. ఇంకో  రకంగా నవ్వుకి పుట్టినరోజు అనాలి. ఈ సందర్భంగా బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న మొట్ట మొదటి తెలుగు- నేపాలీ చిత్రమైన 'హ్రశ్వ దీర్ఘ' నుండి ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. 2024 సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది 'హ్రశ్వ దీర్ఘ'. 

ఇక హరిహర్ అధికారి,నీతా దుంగన లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రదీప్ రావత్, మొహమ్మద్ అలీ, సునీల్ వర్మ, కభీర్ దుహన్ సింగ్ , సరోజ్ ఖనాల్ వంటి వారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 'నీతా ఫిలిమ్స్ ప్రొడక్షన్' బ్యానర్ పై నీతా దుంగన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా హరిహర్ అధికారి కథని అందిస్తున్నారు. చంద్ర పంత్ దర్శకుడు.

More Press Releases