'అథిరడి' (సోనీ లివ్) మూవీ రివ్యూ!
'అథిరడి' ఓ మలయాళ సినిమా. బాసిల్ జోసెఫ్ .. టోవినో థామస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, అరుణ్ అనిరుద్ధన్ దర్శకత్వం వహించాడు. మే 14వ తేదీన థియేటర్లలో విడుదలైన సినిమా ఇది. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 70 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఐదు భాషల్లో అందుబాటులో ఉంది.
సామ్ కుట్టి (బాసిల్ జోసెఫ్) ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. ప్రశాంత్ తో కలుపుకుని తన కంటూ ఒక గ్యాంగ్ ను రెడీ చేసుకుంటాడు. గతంలో సామ్ కుట్టి అన్నయ్య 'జోసెఫ్' (సుకుమార్) కూడా అదే కాలేజ్ లో చదువుతాడు. ఆ సమయంలో 'ఆరోహణ్' అనే పేరుతో ప్రతి ఏడాది ఒక ఫెస్ట్ ను నిర్వహిస్తూ వస్తారు.ఒకసారి నిర్వహించిన ఫెస్ట్ లో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు స్టూడెంట్స్ చనిపోతారు. అందుకు కారకుడు జోసెఫ్ అనే ముద్ర పడిపోతుంది.
కాలేజ్ లో ఆ ఏడాది నుంచి ఆ ఫెస్ట్ ను నిషేదిస్తారు. తన గురించి ఆ కాలేజ్ లో ఒక చేదు అభిప్రాయం ఉండిపోవడం జోసెఫ్ ను మానసికంగా కుంగదీస్తుంది. ఆ కాలేజ్ లో ఆ ఫెస్ట్ ను మళ్లీ జరిపించి, తన అన్నయ్యతో పాటు అప్పటి బ్యాచ్ ను ఆహ్వానించాలనే ఒక బలమైన అభిప్రాయంతో సామ్ కుట్టి ఉంటాడు. అందుకు సంబంధించిన అతని ప్రయత్నాలను, స్వాతి ఆర్ కృష్ణ (రియా శిబూ) సపోర్ట్ చేస్తుంటుంది.
కాలేజ్ లో నిర్వహించే ఫెస్ట్ లో పాడటానికిగాను, సింగర్ 'వినీత్ శ్రీనివాసన్' ను సామ్ కుట్టి ఒప్పిస్తాడు. అయితే ఆ సమయంలోనే స్ట్రీట్ సింగర్ అయిన కుట్టన్ (టోవినో థామస్)తో సామ్ కుట్టీ మిత్ర బృందం గొడవ పడుతుంది. వాళ్ల కారణంగా కుట్టన్ భార్య గాయపడుతుంది. కుట్టన్ పెద్ద గూండా అనీ, అతని పేరుపై చాలా కేసులున్నాయనే విషయం సామ్ కుట్టీకి ఆ తరువాతనే తెలుస్తుంది. అప్పుడు సామ్ కుట్టి ఏం చేస్తాడు? కాలేజ్ ఫెస్ట్ విషయంలో అతని ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.
ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో నిర్వహించిన ఫెస్ట్ లో కొంతమంది స్టూడెంట్స్ చనిపోతారు. దాంతో అప్పటి నుంచి ఆ కాలేజ్ లో ఆ ఫెస్ట్ ను నిషేధిస్తారు. అందుకు కారకుడు జోసెఫ్ అనే ముద్రపడిపోతుంది. తన అన్నయ్యపై పడిన ఆ ముద్రను చెరిపేయడం కోసం అదే కాలేజ్ లో సామ్ కుట్టి చేరతాడు. ఆ ఫెస్ట్ ను మళ్లీ జరిపించడం కోసం అతను చేసే ప్రయత్నమే ఈ సినిమాలోని ప్రధానమైన కథాంశం.
హీరో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరడం .. అతని స్టైల్ .. యాటిట్యూడ్ .. తన అన్నయ్య విషయంలో తాను అనుకున్నది సాధించాలనే ఒక ఆరాటం తాలూకు సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. ఫ్రెండ్షిప్ .. లవ్ .. అల్లర్లు .. ఆకతాయి వేషాలతో సరదాగా సాగిపోతుంది. ఇక టోవినో థామస్ ఎంట్రీతో సెకండాఫ్ కొనసాగుతుంది. హీరో ప్రయత్నాలకు కుట్టన్ అడ్డుపడటం .. అతణ్ణి దాటుకుని హీరో ముందుకు వెళ్లడం వంటి సన్నివేశాలు సెకండాఫ్ ను ముందుకు తీసుకుని వెళతాయి.
ఇక కథ ప్రీ క్లైమాక్స్ కి చేరుకునే సరికి, సింగర్ వినీత్ శ్రీనివాస్ కిడ్నాప్ డ్రామా మొదలవుతుంది. కాలేజ్ ఫెస్ట్ జరగకుండా కుట్టన్ గ్యాంగ్ అతణ్ణి కిడ్నాప్ చేయడం, ఆ గ్యాంగ్ బారి నుంచి అతణ్ణి వినిపించి తీసుకుని రావడానికి సామ్ కుట్టి బ్యాచ్ రంగంలోకి దిగడంతో ఈ డ్రామా పీక్ స్టేజ్ కి చేరుకుంటుంది.
కాలేజ్ నేపథ్యంలో లవ్ .. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్స్ ను కలుపుకుంటూ దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్నాడు. ప్రధానంగా యూత్ ను దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలను నడిపించాడు. సాధారణంగా కాలేజ్ క్యాంపస్ కథలు అనగానే లవ్ కీ .. ఫ్రెండ్ షిప్ కీ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఈ కథలో దర్శకుడు వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది.
ఇక హీరోకి కాలేజ్ క్యాంపస్ లో కాకుండా బయటి నుంచి విలనిజం ఎదురవుతుంది. టోవినో థామస్ పాత్ర ఎంట్రీ .. తన ప్రమేయం లేకుండానే హీరో అతనికి శత్రువు కావడం వంటి సీన్స్ బాగున్నాయి. కుట్టన్ పేరుగల ఆ పాత్రకి ఇచ్చిన బిల్డప్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. కాకపోతే ఆ తరువాత కథ మాత్రం ఆడియన్స్ అంచనాలకి తగినట్టుగా సాగదు. పేలవమైన సన్నివేశాలకు సరైన కామెడీ తోడు లేక తేలిపోతుంటాయి. చివరివరకూ అదే పరిస్థితి కొనసాగడమే విచారించదగిన విషయం.
బాసిల్ జోసెఫ్ లుక్ .. అతని యాటిట్యూడ్ .. నటనకి వంక బెట్టవలసిన పనిలేదు. కామెడీ పరంగా ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ఆయన పాత్రను బాగానే డిజైన్ చేశారుగానీ, కథాపరమైన బలం లేకపోవడం నిరాశను కలిగిస్తుంది. ఇక టోవినో పాత్రలోను ఆడియన్స్ ఆశించే పవర్ కనిపించలేదు. హీరోయిన్ పేరుకే తప్ప, ఆ పాత్ర వైవు నుంచి ఎలాంటి ప్రయోజనం జరగలేదు.
సామ్యూల్ హెన్రీ ఫొటోగ్రఫీ బాగుంది. విష్ణు విజయ్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఛమన్ చాకో ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. బాసిల్ జోసెఫ్ సినిమా అనగానే ఆడియన్స్ ఆశించేది బలమైన కామెడీ. కానీ అది ఈ సినిమాలో మనకి కనిపించదు. అక్కడక్కడా కాస్త నవ్వు ముఖం పెడతాం గానీ, బాసిల్ సినిమా నుంచి ఊహించినదానికి అది చాలా తక్కువనే చెప్పాలి. లుక్ పరంగా .. బాడీ లాంగ్వేజ్ పరంగా బాసిల్ నవ్వించగలిగాడు గానీ, కథాకథనాల పరంగా మెప్పించలేకపోయాడని చెప్పాలి.

Movie Details
Movie Name: Athiradi
Release Date: 2026-06-19
Cast: Arun Anirudhan,
Director: Arun Anirudhan
Producer: Basil Joseph
Music: Vishnu Vijay
Banner: Basil Joseph Entertainment
Review By: Peddinti
Trailer