వెండితెరపై కనిపించాలనే కోరిక మనసులో ఉంటే ఎప్పటికైనా ఆ కోరిక నెరవేర్చుకునే దిశగా ప్రయత్నిస్తుంటారు కొంత మంది. ఆ జాబితాకు చెందిన వ్యక్తే ప్రముఖ వ్యాపార వేత్త అరుళ్ శరవణన్. వ్యాపార రంగంలో ఉన్నతస్థానంలో ఉన్న ఈయన 'ది లెజెండ్' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఇప్పుడు రెండో ప్రయత్నంగా 'లీడర్' అనే సినిమాలో కథానాయకుడిగా ప్రేక్షకులు ముందుకొచ్చారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? లీడర్ కథేంటి? రివ్యూలో తెలుసుకుందాం.
శక్తివేల్ (లెజెండ్ శరవణన్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. కూతురు అయిరేని (ఇయల్) అంటే ఆయనకు ప్రాణం. కూతురుకు ఆరోగ్య సమస్య కూడా ఉండటంతో ఆమెను కంటిరెప్పలా చూసుకుంటు ఉంటాడు. పాపే లోకంగా బ్రతుకుతుంటాడు. అనుకోకుండా ఎస్‌ఐ ఇంద్రా సత్యమూర్తి ( ఆండ్రియా) తూత్తుకూడి సీపోర్ట్‌లో సాల్ట్ (బాహుబలి ప్రభాకర్) చేసే అక్రమ వ్యాపారాలను క్లోజ్ చేయడానికి శక్తి వేల్ సాయం కోరుతుంది. అయిరేనిని సాల్ట్ మనుషులు కిడ్నాప్ చేశారని అబద్దం చెప్పి, శక్తి వేల్‌ను సాల్ట్ గ్యాంగ్‌పై ఉసికొల్పుతుంది. అతని సహాయంతో పోర్టులో అత్యంత ప్రమాదకరమైన అమోనియా పేలుడు పదార్థాలు ఉన్నకంటెనర్‌ను పట్టుకుంటుంది.
ఇక పోలీసుల చేతికి చిక్కిన ఆకంటెయినర్‌ను ఎలాగైనా తీసుకొచ్చి తనకు ఇవ్వకపోతే కూతురును చంపేపస్తానని సాల్ట్ బెదిరిస్తాడు. మరి కూతురును కాపాడేందుకు శక్తి వేల్ ఏం చేశాడు? శక్తి వేల్‌కు ఉన్న నేపథ్యం ఏమిటి? ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరా (పాయల్ రాజ్‌పుత్)ను శక్తి వేల్ ఎందుకు చంపాడు? అతనికి ప్రఖ్యాతి పొందిన ఓ గూఢాచరి టీమ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? సాల్ట్ చేసే కార్యకలపాలకు ఉగ్రవాది డెవిల్ (సంతోష్ ప్రతాప్)కు ఉన్న రిలేషన్ ఏమిటి? ఈ కథలో ఎస్‌పీ భక్తవత్సలం (శ్యామ్), సత్యమూర్తి (లాల్) పాత్రలు కథకు ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలు మిగతా కథను తెరపై చూసి తెలుసుకోవాలి.
ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్‌తో అల్లుకున్న మాస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. మాస్, యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఇలా అన్ని అంశాలు జోడించిన ఈ కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఓ స్పై ఏజెంట్.. సాదారణ వ్యక్తిలా జీవితాన్ని గడపటం, అతనికో ఫ్లాష్‌బ్యాక్, ఆయన గతంలో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్, ఇలాంటి కథలతో చాలా సినిమాలొచ్చినా, దర్శకుడు కథనం నడపటంలో, ఆడియన్స్‌కు థ్రిల్లింగ్ అంశాలను అందించే ప్రయత్నం చేశాడు. సినిమాలో తదుపరి సన్నివేశం ఏమిటో గెస్ చేసే విధంగా ఉన్నా, యాక్షన్ సన్నివేశాలను రూలకల్పన చేయడంలో చూపించిన నవ్యత అలరిస్తుంది. తొలిభాగం స్లోగా, కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ సీన్స్‌తో యావరేజీ మార్కులతో వెళ్లిపోతుంది.
ఇక కథలోని కీలకభాగం, ట్విస్ట్‌లు, మేజర్ యాక్షన్ సన్నివేశాలు పూర్తి కమర్షియల్ అంశాలతో నిండి ఉంటుంది.మెకానిక్‌గా కనిపించిన హీరో నేపథ్యాన్ని రివీల్ చేసే సన్నివేశాలు, పాయల్ రాజ్‌పుత్ ఫ్లాష్‌బ్యాక్ ఏపిసోడ్, గూఢాచారి టీమ్ చేసే ఆపరేషన్స్ ఫర్వాలేదనిపిస్తాయి.రా ఏజెంట్‌గా కథానాయకుడు తన టీమ్‌తో చేసే ఓ విదేశీ ఆపరేషన్, ఆ గ్యాంగ్‌తో యాక్షన్ ఏపిసోడ్ థ్రిల్ల్‌ను పంచుతుంది. హీరోని ఎలివేట్ చేయాలనే లక్ష్యంతో దర్శకుడు చిత్రీకరించిన ఎలివేషన్ సీన్స్‌తో కథలో కొంత గందరగోళం, కాస్త కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అయితే పతాక సన్నివేశాల్లో అన్ని ట్విస్ట్‌లు రివీల్ కావడంతో కథ రీజనల్‌బుల్‌గా ఉందేమో అని ఫీల్ కలుగుతుంది.
స్పై ఏజెంట్‌గా, మెకానిక్‌గా రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో శరవణన్ కనిపించాడు. అయితే సినిమా కెరీర్ తొలినాళ్లలో ఉన్న ఆయనకు ఈ పాత్ర కాస్త బరువుగానే అనిపిస్తుంది. అయితే ఆయన మొదటి సినిమా ''ది లెజెండ్'తో కంపేర్ చేస్తే పర్‌ఫార్మెన్స్ విషయంలో ఓకే అనిపిస్తుంది. అయితే ఇలాంటి యాక్షన్ మాస్, ఎమోషన్ సినిమాలు చేస్తున్నప్పుడు నటన విషయంలో కూడా మరింత శ్రద్ధ పెడితే బాగుంటుంది. శరవణన్ బాడీ లాంగ్వేజ్, సంభాషణలు పలికిన తీరు తమిళ సూపర్‌స్టార్‌ను అనుకరిస్తున్నట్లుగా అనిపించింది.
పాయల్ రాజ్‌పుత్ పాత్ర నిడివి పెంచింతే బాగుండేది. సినిమా అంతా సీరియస్ మూడ్‌లో ఉండటంతో కమెడియన్ వీటీ గణేషన్ పాత్ర కూడా సీరియస్‌గా ఉంది. ఆయన పంచ్‌లు పెద్దగా పేలలేదు. బాహుబలి ప్రభాకర్, సంతోష్ ప్రతాప్ పాత్రలు విలన్‌లుగా తమ పరిధి మేరకు నటించారు. జిబ్రాన్ నేపథ్ సంగీతం సన్నివేశాలను హైలైట్ చేసే విధంగా ఉంది. సినిమా నిర్మాణ విలువలు, పెట్టిన ఖర్చు సినిమాలో కనిపిస్తుంది.
లాజిక్‌లు, చిన్న చిన్న మైనస్‌లను పట్టించుకోకపోతే ఈ భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమా 'లీడర్' మిమ్ములను ఓ మోస్తరుగా అలరిస్తుంది.
'లీడర్' మూవీ రివ్యూ
Leader Review
Movie Details
Movie Name: Leader
Release Date: 2026-04-03
Cast: Payal Rajput, Shaam, Andrea, Santhosh Prathap, Lal, Baahubali Prabhakar, Amritha Aiyer, VTV Ganesh, Aishwarya, Aranthangi Nisha, Ayraal, Jayamishra, Padman, Yogiram, Oak Sundar, Mahanadi Shankar, Mariam George, Aditya Kathir, Vel Arunachalam, Niranjan, Shobhan Babu, Ashok Pandian,
Director: R. S. Durai Senthil Kumar
Music: Ghibran Vaibodha
Banner: Legend Saravana Stores Productions
Review By: Maduri Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer